కర్ణాటక కాంగ్రెస్ లో ఎవరీమె ?

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీ-ఎస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వం పడిపోయే అంచుల్లో ఉందని వార్తలు వస్తున్న వేళ.. ఓ మహిళా ఎమ్మెల్యే మాత్రం ‘ స్పెషల్ అపియరెన్స్ ‘ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సౌమ్యా రెడ్డి. పార్టీ సీనియర్ నేత రామలింగారెడ్డి కూతురైన ఈమె మంగళవారం బెంగుళూరులో..విధానసౌధలో జరిగిన సీఎల్ఫీ సమావేశానికి హాజరైంది. (అయితే రామలింగారెడ్డి ఈ భేటీకి గైర్ హాజరయ్యారు). ఈ మధ్యే ఢిల్లీలో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీతో […]

కర్ణాటక కాంగ్రెస్ లో ఎవరీమె ?
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 09, 2019 | 6:30 PM

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీ-ఎస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వం పడిపోయే అంచుల్లో ఉందని వార్తలు వస్తున్న వేళ.. ఓ మహిళా ఎమ్మెల్యే మాత్రం ‘ స్పెషల్ అపియరెన్స్ ‘ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సౌమ్యా రెడ్డి. పార్టీ సీనియర్ నేత రామలింగారెడ్డి కూతురైన ఈమె మంగళవారం బెంగుళూరులో..విధానసౌధలో జరిగిన సీఎల్ఫీ సమావేశానికి హాజరైంది. (అయితే రామలింగారెడ్డి ఈ భేటీకి గైర్ హాజరయ్యారు). ఈ మధ్యే ఢిల్లీలో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీతో భేటీ అయిన సౌమ్యా రెడ్డి.. కాంగ్రెస్ పార్టీతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. కానీ ఇక్కడ.. ఈ రాష్ట్రంలో పార్టీ సీనియర్లకు తగిన గౌరవం ఇవ్వడంలేదని, జూనియర్లకు, అనుభవం లేనివారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆమె పేర్కొంది. 13 నెలలు గడిచాక.. తన తండ్రి రామలింగారెడ్డి గత డిసెంబరులో పార్టీ వ్యవహారాల గురించి నోరెత్తవలసివచ్చిందని ఆమె వ్యాఖ్యానించింది. కాగా-ఈ రాష్ట్రంలో సంకీర్ణ కూటమి ప్రభుత్వం పడిపోతుందా లేక గండం నుంచి బయటపడి గట్టెక్కుతుందా అన్న విషయాన్ని తాను చెప్పలేనని, ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేల మాదిరిగానే తాను కూడా రాజీనామా చేసే అవకాశం ఉందని సౌమ్యారెడ్డి తెలిపింది. ‘ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మాకు ద్రోహం చేసిందని భావిస్తున్నాం.. పార్టీలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు. దీంతో మా తండ్రి ఎంతో మనస్తాపం చెందుతున్నారు ‘ అని ఆమె వెల్లడించింది. తన తండ్రి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓ మనుగడనిచ్చారని, కానీ ఈ ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించడం లేదని సౌమ్యారెడ్డి వాపోయారు.