సుశాంత్ ఆత్మహత్యతో.. వారిని అన్‌ఫాలో చేసిన కరణ్ జోహార్..

|

Jun 18, 2020 | 7:55 PM

కరణ్ జోహార్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన ట్విట్టర్ ఖాతాలో చాలామంది బాలీవుడ్ పెద్దలను, స్టార్ కిడ్స్, నెపోటిజానికి అడ్డం పట్టే వాళ్లను అన్‌ఫాలో చేశాడు.

సుశాంత్ ఆత్మహత్యతో.. వారిని అన్‌ఫాలో చేసిన కరణ్ జోహార్..
Follow us on

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణంతో ఫ్యాన్స్, నెటిజన్లు నిర్మాత కరణ్ జోహార్, కొంతమంది స్టార్ కిడ్స్ సినిమాలను బాయ్‌కాట్‌ చేస్తే బీ-టౌన్‌లో ఉన్న నెపోటిజం చాలావరకు తగ్గుతుందని సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. అంతేకాకుండా సుశాంత్ మరణం విషయంలో నిర్మాత కరణ్ జోహార్‌ను చాలామంది నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కరణ్ జోహార్ కేవలం స్టార్ కిడ్స్‌తో మాత్రమే సినిమాలు తీస్తాడని.. బయట వ్యక్తులకు అవకాశాలు రానివ్వకుండా చేస్తాడని ఆరోపించారు. అతడు ఉద్దేశపూర్వకంగానే సుశాంత్‌ను పెద్ద సినిమాలు, బ్యానర్ల నుంచి తప్పించాడని మరికొందరు మండిపడ్డారు. జాన్వి కపూర్, అలియా భట్, అనన్య పాండే వంటి చాలా మంది స్టార్ కిడ్స్‌ను కరణ్ జోహార్ తన సొంత బ్యానర్‌పై లాంచ్ చేసిన సంగతి విదితమే.

ఇదిలా ఉంటే తాజాగా సల్మాన్ ఖాన్, ఏక్తా కపూర్, సాజిద్ నడియాద్వాలా, సంజయ్ లీలా భన్సాలీలతో పాటు నిర్మాత కరణ్ జోహార్‌పై సుశాంత్ మరణం విషయంలో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరణ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన ట్విట్టర్ ఖాతాలో చాలామంది బాలీవుడ్ పెద్దలను, స్టార్ కిడ్స్, నెపోటిజానికి అడ్డం పట్టే వాళ్లను అన్‌ఫాలో చేశాడు. ప్రస్తుతం కరణ్ కేవలం ఎనిమిది మందిని మాత్రమే ఫాలో అవుతున్నాడు. వారు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్‌లు. వీరితో పాటు తన నిర్మాణ సంస్థ CEO అపూర్వ మెహతాను, మరో ముగ్గురు ఎంప్లాయిస్‌లను, ప్రధాని నరేంద్ర మోదీని అనుసరిస్తున్నాడు. కాగా, బిపాషా బసు, శిల్పా శెట్టి, విక్కీ కౌషల్, జెనీలియా, డియా మీర్జా తదితర ప్రముఖులందరినీ కరణ్ అన్‌ఫాలో చేశాడు.

Also Read:

ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఎంసెట్ ఎగ్జామ్ సెంటర్ మార్చుకోవచ్చు.!

సుశాంత్ ఓ క్రేజీ జీనియస్.. బాలీవుడ్‌నే అతను దూరం పెట్టాడు..

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి వయోపరిమితి పెంపు..!

దేశంలో మళ్లీ లాక్ డౌన్.. క్లారిటీ ఇచ్చిన ప్రధాని..

బ్రేకింగ్: ఐరాస భద్రతా మండలి ఎన్నికల్లో భారత్ అద్భుత విజయం..