బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో ఇండస్ట్రీలో ఉన్న నెపోటిజం మరోసారి బయటపడింది. సుశాంత్‌కు ఎనలేని ప్రతిభ ఉన్నా.. కొంతమంది బీ-టౌన్ ప్రముఖులు అతనికి ఆఫర్స్ రాకుండా చేశారని.. దాని కారణంగా డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్య చేసుకున్నారని బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ నెపోటిజం విషయంలో కొందరు బాలీవుడ్ ప్రముఖులపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా బడా నిర్మాత కరణ్ జోహార్ విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కుంటున్నాడు. అతడు కేవలం సినీ ప్రముఖుల వారసులతో మాత్రమే సినిమాలు తీస్తాడని.. సినిమా నేపధ్యం లేని ప్రతిభావంతులను తోక్కేస్తాడని కొందరు ఆరోపిస్తున్నారు.
ఇప్పటివరకు ‘కాఫీ విత్ కరణ్’ షోకు సంబంధించిన క్లిప్స్‌తో కరణ్ జోహార్‌ను ఒక ఆట ఆడుకున్న నెటిజన్లు.. అతని నెపోటిజానికి అడ్డం పట్టేలా మరో ట్వీట్‌ను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానాను కరణ్ జోహార్ ఏవిధంగా రిజెక్ట్ చేశాడో చూడండి అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కరణ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఆయుష్మాన్ తన ‘క్రాకింగ్ ది కోడ్: మై జర్నీ ఇన్ బాలీవుడ్’ అనే పుస్తకంలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. ఇక నెటిజన్లు ఆ పాయింట్‌ను తవ్వి మరీ కరణ్ జోహార్ నెపోటిజాన్ని బహిర్గతం చేశారు. అందులో 2007లో కరణ్ జోహార్ తనను ఎలా తిరస్కరించాడో ఆయుష్మాన్ వివరించాడు. “మేము స్టార్స్‌తో మాత్రమే పని చేస్తాం” అని అతనికి నాడు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.
Also Read:
ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఎంసెట్ ఎగ్జామ్ సెంటర్ మార్చుకోవచ్చు.!
సుశాంత్ ఓ క్రేజీ జీనియస్.. బాలీవుడ్‌నే అతను దూరం పెట్టాడు..
జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి వయోపరిమితి పెంపు..!
దేశంలో మళ్లీ లాక్ డౌన్.. క్లారిటీ ఇచ్చిన ప్రధాని..
బ్రేకింగ్: ఐరాస భద్రతా మండలి ఎన్నికల్లో భారత్ అద్భుత విజయం..
This is how Ayushmann khurrana exposed Karanjohar once ? #JusticeForSushantSinghRajput#karanjohargang pic.twitter.com/KEMubK0zWK
— Brahmin_girl? (@shizuka261) June 16, 2020