బంగారం దొంగలకు కన్నూర్ ఎయిర్ పోర్టు అడ్డగా మారుతోంది. గోల్డ్‌ను అక్రమ మార్గంలో తరలించేందుకు ఈ విమానాశ్రయం కేంద్రంగా ఉపయోగించుకుంటున్నారు. వారి ప్రయత్నాలను కస్టమ్స్ అధికారులు పట్టేస్తున్నారు. తాజాగా లిక్విడ్ గోల్డ్‌ను తరలిస్తున్న స్మగ్లర్లను పట్టుకున్నారు.
కేరళలోని కన్నూర్ విమానాశ్రయంలో దొంగ బంగారం పట్టుబడింది. ఎయిర్‌పోర్టులోని ఎయిర్ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన అధికారులు దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 1678.50 గ్రాముల బంగారం మిశ్రయం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రయాణికుడు బంగారం మిశ్రమాన్ని ఒక పాలీథిన్ కవర్‌లో నింపి అక్రమంగా తరలించే ప్రయత్నం చేశాడని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందన్నారు.
Air Intelligence Unit at Kannur Airport seized 1678.5 grams of gold compound from a passenger who arrived from Dubai. The passenger has been arrested and further investigation is underway: Commissionerate of Customs (Preventive), Kochi. #Kerala pic.twitter.com/t6WF7i7SOq
— ANI (@ANI) November 14, 2020