AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నా ఆఫీసును కూల్చేశారు, రూ. 2 కోట్ల పరిహారం చెల్లించాలి’, కంగనా రనౌత్

ముంబైలోని తన కార్యాలయాన్ని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అక్రమంగా కూల్చివేశారని, ఇందుకు తనకు రూ. 2 కోట్ల పరిహారాన్ని చెల్లించాలని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కోరింది. ఈ మేరకు ఆమె బాంబే హైకోర్టులో

'నా ఆఫీసును కూల్చేశారు, రూ. 2 కోట్ల పరిహారం చెల్లించాలి', కంగనా రనౌత్
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 15, 2020 | 7:35 PM

Share

ముంబైలోని తన కార్యాలయాన్ని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అక్రమంగా కూల్చివేశారని, ఇందుకు తనకు రూ. 2 కోట్ల పరిహారాన్ని చెల్లించాలని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కోరింది. ఈ మేరకు ఆమె బాంబే హైకోర్టులో సవరణ పిటిషన్ దాఖలు చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను చేసిన వ్యాఖ్యలకు గాను మున్సిపల్ అధికారులు ఈ చర్య చేపట్టారని, ఈ కార్పొరేషన్ పాలక శివసేన ఆధ్వర్యంలోనే ఉందని ఆమె పేర్కొంది.  కాగా ఈ పిటిషన్ పై ఈ నెల 22 న కోర్టు విచారణ జరపనుంది. కేవలం ప్రభుత్వాన్ని విమర్శించింత మాత్రాన ఇలా తన ఆఫీసును కూల్చివేస్తారా అని కంగనా ప్రశ్నించింది.