సాగర్ 14 గేట్లు ఎత్తివేత..కనులవిందుగా కృష్ణమ్మ

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం పెరిగింది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండడంతో ఇప్పటికే శ్రీశైలం డ్యామ్‌ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు

సాగర్ 14 గేట్లు ఎత్తివేత..కనులవిందుగా కృష్ణమ్మ
Follow us

|

Updated on: Sep 15, 2020 | 8:26 PM

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం పెరిగింది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండడంతో ఇప్పటికే శ్రీశైలం డ్యామ్‌ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక, నాగార్జునసాగర్‌కు కూడా పెద్దస్థాయిలో వరద వచ్చిచేరుతోంది. దీంతో సాగర్‌ 14 క్రస్టు గేట్లు 10 ఫీట్ల మేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ ప్రాంతంలో అపూరూప దృశ్యం కనులవిందు చేస్తోంది. ప్రస్తుతం సాగర్‌కు ఇన్‌ఫ్లో రూపంలో 2,48,254 క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతుండగా.. 14 గేట్ల ద్వారా 2,09,700 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312.0405 టీఎంసీలు కాగా… ప్రస్తుత నీటి నిల్వ  311.80 టీఎంసీలుగా ఉంది. ఇక, ప్రాజక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 589.60 అడుగులకు చేరింది. ఎగువ నుండి వరద ప్రవాహంలో హెచ్చుతగ్గులనుబట్టి నీటి పారుదల శాఖ అధికారులు సాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తడం, లేదా దించడం చేస్తున్నారు.