చికిత్స పొందుతూ.. లోకో పైలట్ చంద్రశేఖర్‌ మృతి

| Edited By:

Nov 16, 2019 | 11:37 PM

ఇటీవల హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్‌ సమీపంలో జరిగిన ఎంఎంటీఎస్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లోకో పైలట్ చంద్రశేఖర్ మృతిచెందారు. ఈ నెల 11వ తేదీన ఉదయం కాచిగూడ రైల్వే స్టేషన్‌ సమీపంలో హంద్రీనీవా ఎక్స్‌ప్రెస్‌ను ఎంఎంటీఎస్ ట్రైన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో చంద్రశేఖర్ ట్రైన్ ఇంజిన్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. అయితే అధికారులు కొన్ని గంటలపాటు శ్రమించి ఆయన్ను బయటకు తీశారు. అనంతరం ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో అయిదు రోజుల నుంచి కేర్ ఆస్పత్రిలో […]

చికిత్స పొందుతూ.. లోకో పైలట్ చంద్రశేఖర్‌ మృతి
Follow us on

ఇటీవల హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్‌ సమీపంలో జరిగిన ఎంఎంటీఎస్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లోకో పైలట్ చంద్రశేఖర్ మృతిచెందారు. ఈ నెల 11వ తేదీన ఉదయం కాచిగూడ రైల్వే స్టేషన్‌ సమీపంలో హంద్రీనీవా ఎక్స్‌ప్రెస్‌ను ఎంఎంటీఎస్ ట్రైన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో చంద్రశేఖర్ ట్రైన్ ఇంజిన్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. అయితే అధికారులు కొన్ని గంటలపాటు శ్రమించి ఆయన్ను బయటకు తీశారు. అనంతరం ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో అయిదు రోజుల నుంచి కేర్ ఆస్పత్రిలో చికిత్స పోందుతూ ఉండగా.. కాసేపటి క్రితం తుదిశ్వాస విగడిచాడు. కాగా, రెండు రోజుల క్రితమే అతడి కాలుకు గాయమవ్వడంతో ట్రీట్‌మెంట్‌ చేసి కాలును తొలగించారు.