వర్మ.. ఓ చరిత్రహీనుడుః కేఏ పాల్

|

Dec 14, 2019 | 4:11 PM

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ఎట్టకేలకు స్పందించారు. స్కైప్ ద్వారా మాట్లాడిన ఆయన.. కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వర్మ చిత్రాన్ని రూపొందించాడని మండిపడ్డారు. ప్రజల మధ్య గొడవలు రేకెత్తించేలా సినిమా ఉందని.. వర్మ వట్టి అబద్దాలు మాత్రమే మాట్లాడతాడని దుయ్యబట్టారు. ఇకపోతే సెన్సార్ బోర్డు ఆదేశాలతో సినిమాలోని కొన్ని సీన్లను కత్తిరించి.. ఆపై చిత్రాన్ని విడుదల చేశారని పాల్ చెప్పుకొచ్చారు. […]

వర్మ.. ఓ చరిత్రహీనుడుః కేఏ పాల్
Follow us on

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ఎట్టకేలకు స్పందించారు. స్కైప్ ద్వారా మాట్లాడిన ఆయన.. కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వర్మ చిత్రాన్ని రూపొందించాడని మండిపడ్డారు. ప్రజల మధ్య గొడవలు రేకెత్తించేలా సినిమా ఉందని.. వర్మ వట్టి అబద్దాలు మాత్రమే మాట్లాడతాడని దుయ్యబట్టారు. ఇకపోతే సెన్సార్ బోర్డు ఆదేశాలతో సినిమాలోని కొన్ని సీన్లను కత్తిరించి.. ఆపై చిత్రాన్ని విడుదల చేశారని పాల్ చెప్పుకొచ్చారు. అయితే సినిమా విషయంలో మాత్రం తుది గెలుపు తమదే అయ్యిందని.. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందన్న పాల్.. వర్మ ఇప్పటికైనా తనను క్షమాపణ కోరితే మంచిదని లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని విమర్శించారు.

ప్రస్తుతం అమెరికాలో ఉన్న కేఏ పాల్.. ప్రపంచశాంతి కోసం తిరుగుతున్నానన్నారు. తనకు పబ్లిసిటీ అవసరమే లేదని.. తాను ఎన్నికలను మార్చిలోనే బహిష్కరించారని ఆయన తెలిపారు.