ఒకే ఒక్కటి మిగిలింది.. మహాత్ముని ప్రయాణాన్ని చెప్పేది అదే
జాతిపిత మహాత్మాగాంధీ స్వతంత్ర పోరాట సమయంలో దేశమంతటా పర్యటించారు. అందులో భాగంగా ఆయన ఆంధ్రదేశంలో కూడా కాలు మోపారు. అక్కడ ఎన్నో చోట్ల సభలు, సమావేశాలు జరిపారు. ఎంతోమందిని స్వరాజ్య ఉద్యమం వైపునకు మళ్లించారు గాంధీ. అయితే మహాత్ముడు ఆంధ్రాలో చేసిన పర్యటనకు సంబంధించిన వివరాలు ఒక పుస్తకంలో ప్రచురించారు. దీన్ని 1970లో అప్పటి ఏపీ ప్రభుత్వమే స్వయంగా ఒక సంకలనంగా ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్‌లో గాంధీజీ అనే పేరుతో మహాత్ముని పర్యటనకు సంబంధించిన అన్ని వివరాలు 1200 […]

జాతిపిత మహాత్మాగాంధీ స్వతంత్ర పోరాట సమయంలో దేశమంతటా పర్యటించారు. అందులో భాగంగా ఆయన ఆంధ్రదేశంలో కూడా కాలు మోపారు. అక్కడ ఎన్నో చోట్ల సభలు, సమావేశాలు జరిపారు. ఎంతోమందిని స్వరాజ్య ఉద్యమం వైపునకు మళ్లించారు గాంధీ. అయితే మహాత్ముడు ఆంధ్రాలో చేసిన పర్యటనకు సంబంధించిన వివరాలు ఒక పుస్తకంలో ప్రచురించారు. దీన్ని 1970లో అప్పటి ఏపీ ప్రభుత్వమే స్వయంగా ఒక సంకలనంగా ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్‌లో గాంధీజీ అనే పేరుతో మహాత్ముని పర్యటనకు సంబంధించిన అన్ని వివరాలు 1200 పేజీలతో ఈ పుస్తకంలో క్రోడీకరించారు. అయితే ఈ పుస్తకం ప్రస్తుతం ఎక్కడా లభ్యం కావడం లేదు. ఆనాడు ముద్రించిన అన్నికాపీలు ఏమైపోయాయో ఎవరికీ తెలియదు గానీ.. ఒకే ఒక్కపుస్తకం మిగిలి ఉన్నట్టుగా మాత్రం గుర్తించారు. ఇదే ఇప్పుడు వార్తగా నిలిచింది. గాంధీజీకి చెందిన డేటాను సేకరించడానికి ఓ కమిటీని నియమించారు. ఆ కమిటీ మూడేళ్లనుంచి ఈ వివరాలు సేకరించాలని ఎంతో ప్రయత్నిస్తోంది. చివరికి వారికి ఒకే ఒక్క పుస్తకం లభించింది. అంటే మూడేళ్ల శ్రమ ఫలించిందన్నమాట. గాంధీ స్మారక ట్రస్ట్ ఈ వివరాలను సేకరిస్తోంది.



