ఆర్ధిక ఇబ్బందుల్లో రాష్ట్రం..అయినా కోట్లాది రూపాయలు దుబారా.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ఆర్ధిక ఇబ్బందుల్లో రాష్ట్రం..అయినా కోట్లాది రూపాయలు దుబారా.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

తెలంగాణలో బీజేపీ బలాన్ని పుంజుకునే ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేరుగా ఆరోపణలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆర్ధిక క్రమశిక్షణ లేదని, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని చెబుతూనే కోట్లాది రూపాయలు అనవసరంగా ఖర్చుచేస్తున్నారని విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై పలు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటలకు చేతలకు ఎక్కడా పొంతన లేదన్నారు. రాష్ట్రం తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని చెబుతూనే పొరుగురాష్ట్రాల ముఖ్యమంత్రులకు కోట్లాది రూపాయల […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 27, 2019 | 5:25 AM

తెలంగాణలో బీజేపీ బలాన్ని పుంజుకునే ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేరుగా ఆరోపణలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆర్ధిక క్రమశిక్షణ లేదని, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని చెబుతూనే కోట్లాది రూపాయలు అనవసరంగా ఖర్చుచేస్తున్నారని విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై పలు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటలకు చేతలకు ఎక్కడా పొంతన లేదన్నారు.

రాష్ట్రం తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని చెబుతూనే పొరుగురాష్ట్రాల ముఖ్యమంత్రులకు కోట్లాది రూపాయల విలువ కలిగిన వెండి వస్తువులు బహుమతులుగా ఇవ్వడం సరికాదంటూ విమర్శించారు కిషన్‌రెడ్డి. ముఖ్యమంత్రి ఆర్ధిక క్రమశిక్షణ పాటించడం లేదని, తెలంగాణ ప్రభుత్వం నేల విడిచి సాము చేస్తోందని, అలా చేస్తే మొదటికే మోసం వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నో ఖర్చులు చేస్తుందని, అయితే అవి పరిమితులకు లోబడి ఉంటాయన్నారు. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం ఎప్పుడూ సహకరిస్తుందని, అలాగే దేశాభివృద్దికి కూడా తగిన విధంగా ప్రణాళిక చేస్తుందని చెప్పారు కిషన్ రెడ్డి.

అనేక సందర్భాల్లో వివిధ రాష్ట్రలకు చెందిన నేతలు సీఎం కేసీఆర్‌‌ను కలిసేందుకు వచ్చినప్పుడు వారిని ఘనంగా సత్కరించడం అలవాటు. ఈ నేపథ్యంలో గతంలో ఆయన నిర్వహించిన యాగాల్లో గానీ, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గానీ పలవురు నేతలకు వెండి వస్తువులను బహుమానంగా ఇచ్చి సత్కరించారు. ఇదే విషయంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తప్పుబడ్డారు. రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఖర్చులు అదుపులో పెట్టుకోకుండా విపరీతంగా ఖర్చు చేయడం సరికాదంటూ హితవు పలికారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu