JP Nadda on Mamata: బెంగాల్‌లో దీదీ సర్కార్ పతనం ఖాయం.. కత్వా రైతు ర్యాలీలో జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు

|

Jan 09, 2021 | 5:03 PM

బీజేపీ ఆధ్వర్యంలో "కృషక్‌ సురక్ష అభియాన్‌" పేరుతో నిర్వహించిన రైతుల సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు.

JP Nadda on Mamata: బెంగాల్‌లో దీదీ సర్కార్ పతనం ఖాయం.. కత్వా రైతు ర్యాలీలో జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు
Follow us on

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీనే టార్గెట్‌గా భారతీయ జనతాపార్టీ విమర్శలకు దిగుతోంది. బీజేపీ ఆధ్వర్యంలో “కృషక్‌ సురక్ష అభియాన్‌” పేరుతో నిర్వహించిన రైతుల సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు.
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాలం దగ్గరపడిందని జోస్యం చెప్పారు. కత్వాలో బీజేపీ నిర్వహించిన రైతు ర్యాలీకి భారీ స్పందన లభించింది.

బెంగాల్‌లో తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతులకు న్యాయం చేస్తామని జేపీ నడ్డా అన్నారు. బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పట్టు కోల్పోతున్న విషయాన్ని గ్రహించే దీదీ పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు అంగీకరించాల్సి వచ్చిందన్నారు. కానీ, ఇప్పటికే ఈ పథకం అమలులో చాలా జాప్యం జరిగిపోయిందని విమర్శించారు. మమతా బెనర్జీ ప్రభుత్వం ఇక రోజులు లెక్కపెట్టుకుంటున్నట్టు స్పష్టమవుతోందని నడ్డా వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో దీదీ సర్కార్‌ పతనం ఖాయమన్న నడ్డా.. బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

మరోవైపు, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ అధికారం నిలబెట్టుకోవాలని తృణమూల్‌ కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా.. ఈసారి పాగా వేయాలని భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. అధికార పక్షానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలను కాషాయ కండువా కప్పి బీజేపీలో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే సువేందు అధికారి సహా దాదాపు 60మందికి పైగా నేతలు తృణమూల్‌ కాంగ్రెస్‌ను వీడి కమలం గూటికి చేరారు. ఈ తరుణంలో ఇరు పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది.

ఆర్జేడీ నేత తేజస్వీ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు.. బీహార్‌లో మధ్యంతరం ఎన్నికలు ఖాయమంటూ కామెంట్