జర్నలిస్టులపై రైల్వే పోలీసుల దాడి..!

| Edited By:

Jun 12, 2019 | 10:59 AM

యూపీలో జర్నలిస్టులకు రక్షణ కరువయ్యింది. షామ్లీ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ప్రమాదాన్ని కవరేజ్ చేయడానికి వెళ్లిన జర్నలిస్ట్‌పై రైల్వే పోలీసులు విరుచుకుపడ్డారు.. రౌడీల్లా ప్రవర్తించారు. అనుమతి లేకుండా దృశ్యాలు చిత్రీకరిస్తావా అంటూ రైల్వే ఎస్‌ఐ చిందులేశాడు. గన్‌తో షూట్ చేస్తానని జర్నలిస్ట్‌ను బెదిరించాడు. బలవంతంగా లాకప్‌లో బంధించాడు. ఎవరికి చెప్పకుంటావో.. చెప్పుకో అంటూ స్టేషన్‌లో హంగామా చేశాడు. టీవీ రిపోర్టర్‌పై రైల్వే పోలీసుల దాడి విషయం తెలుసుకున్న జర్నలిస్టులు షామ్లీ రైల్వే […]

జర్నలిస్టులపై రైల్వే పోలీసుల దాడి..!
Follow us on

యూపీలో జర్నలిస్టులకు రక్షణ కరువయ్యింది. షామ్లీ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ప్రమాదాన్ని కవరేజ్ చేయడానికి వెళ్లిన జర్నలిస్ట్‌పై రైల్వే పోలీసులు విరుచుకుపడ్డారు.. రౌడీల్లా ప్రవర్తించారు. అనుమతి లేకుండా దృశ్యాలు చిత్రీకరిస్తావా అంటూ రైల్వే ఎస్‌ఐ చిందులేశాడు. గన్‌తో షూట్ చేస్తానని జర్నలిస్ట్‌ను బెదిరించాడు. బలవంతంగా లాకప్‌లో బంధించాడు. ఎవరికి చెప్పకుంటావో.. చెప్పుకో అంటూ స్టేషన్‌లో హంగామా చేశాడు.

టీవీ రిపోర్టర్‌పై రైల్వే పోలీసుల దాడి విషయం తెలుసుకున్న జర్నలిస్టులు షామ్లీ రైల్వే పీఎస్‌కు వచ్చి.. ఇదేంటని పోలీసులను నిలదీశారు. కాగా.. జర్నలిస్టులు, పోలీసులు మళ్లీ దాడికి యత్నించారు. చివరకు ఉన్నతాధికారుల జోక్యంతో ఆ రిపోర్టర్‌ను విడుదల చేశారు. ఈ వీడియో కాస్తా వైరల్‌ కావడంతో స్పందించిన రైల్వే అధికారులు, ఘటనకు బాధ్యులైన రైల్వే పోలీసులను విధుల నుంచి తొలగిస్తూ, ఆదేశాలు జారీ చేశారు.

ఈ క్రమంలో.. బాధితుడైన రిపోర్టర్ మాట్లాడుతూ.. తనపై రైల్వే పోలీసులు అకారణంగా దాడి చేశారని ఆరోపించాడు. షామ్లీలో తరుచుగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని, తాను వెలుగులోకి తెచ్చినందుకే తనపై దాడి చేశారని వాపోయాడు.