మరో పార్టీలో చేరండి, లేదా..మీరే పార్టీ పెట్టుకోండి, కపిల్ సిబల్ కి సీనియర్ కాంగ్రెస్ నేత చురక
కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నవారు ఏదైనా మరో పార్టీలో చేరాలని, లేదా వారే కొత్త పార్టీ పెట్టుకోవచ్ఛునని కపిల్ సిబల్ న ఉద్దేశించి లోక్ సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి..
కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నవారు ఏదైనా మరో పార్టీలో చేరాలని, లేదా వారే కొత్త పార్టీ పెట్టుకోవచ్ఛునని కపిల్ సిబల్ న ఉద్దేశించి లోక్ సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి అన్నారు. అదేపనిగా పార్టీని ఇరకాటాన పెట్టే వ్యాఖ్యలు చేసేబదులు సిబల్ వంటివారు ఆ పని చేయవచ్చు అన్నారాయన. వీళ్లంతా గాంధీ కుటుంబానికి, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి చాలా సన్నిహితులని ఆయన చెప్పారు. తమకు కాంగ్రెస్ సరైనది కాదని భావించినప్పుడు ఇలాంటి వ్యక్తులు వేరే పార్టీలో చేరడానికి అభ్యంతరమేముంటుంది అని అధిర్ రంజన్ చౌదరి ప్రశ్నించారు. ఈ విధమైన విమర్శలు పార్టీకి నష్టం కలుగజేస్తాయన్నారు. వీరు పార్టీ నాయకత్వం వద్ద గానీ, సరైన వేదికల్లో గానీ స్వేఛ్చగా తమ అభిప్రాయాలను వివరించవచ్చునన్నారు. బీహార్ ఎన్నికల సమయంలో వీరు పార్టీ విజయానికి ఏమైనా కృషి చేశారా అని కూడా వ్యాఖ్యానించారు. అలా చేసి తమ ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉందన్నారు.
బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై కపిల్ సిబల్ వ్యంగ్యంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇది పార్టీకి మామూలే అన్నారు. పార్టీ ఆత్మావలోకనం చేసుకోవాలని సలహా ఇచ్చారు.