#MSDhoni: ధోనిని వదులుకోవడమే బెటర్.. సీఎస్‌కేకు ఆకాష్ చోప్రా ఉచిత సలహా..!

ఐపీఎల్ 2020లో క్రికెట్ ఫ్యాన్స్‌కు కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఎప్పుడూ ప్లేఆఫ్స్‌కు చేరుకునే సీఎస్‌కే ఈ ఏడాది ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.

#MSDhoni: ధోనిని వదులుకోవడమే బెటర్.. సీఎస్‌కేకు ఆకాష్ చోప్రా ఉచిత సలహా..!
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 18, 2020 | 1:00 PM

Aakash Chopra Comments: ఐపీఎల్ 2020లో క్రికెట్ ఫ్యాన్స్‌కు కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఎప్పుడూ ప్లేఆఫ్స్‌కు చేరుకునే సీఎస్‌కే ఈ ఏడాది ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. స్టార్ ప్లేయర్స్ సురేష్ రైనా, హర్భజన్ సింగ్ జట్టుకు దూరం కావడం.. టోర్నీకి ముందు కొంతమంది ఆటగాళ్లు కరోనా బారిన పడటం.. ఇలా పలు కారణాలతో చెన్నై ఓటములను ఎదుర్కొంది. ఫలితంగా లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. దీనితో ధోనీపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

ధోని ఫిట్‌నెస్ కోల్పోయాడని.. జట్టు ముందుకు నడిపించడంలో కూడా మానసికంగా విఫలమయ్యాడని విమర్శించారు. అంతేకాదు ఐపీఎల్‌కు ‘తలా’ గుడ్‌బై చెప్పే టైం కూడా దగ్గరపడిందని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రాపై పలు సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. వచ్చే ఏడాది ఐపీఎల్‌కు చెన్నై సూపర్ కింగ్స్ ధోనిని విడుదల చేసి.. మళ్లీ తక్కువ రేటుకు కొనుగోలు చేయాలని ఆకాష్ చోప్రా సలహా ఇచ్చాడు.

ధోనిని అలాగే ఉంచుకుంటే సీఎస్కే యాజమాన్యం రూ. 15 కోట్లు నష్టపోతుందన్నాడు. ఐపీఎల్ 2021కు ముందు మెగా ఆక్షన్ ఉన్నట్లయితే ధోని విడుదల చేసి.. మళ్లీ ‘రైట్ టూ మ్యాచ్’ కార్డులో తక్కువ ధరకు కొనుగోలు చేయాలని ఆకాష్ చోప్రా సలహా ఇచ్చాడు. సీఎస్కే యాజమాన్యం రూ. 15 కోట్లు నష్టపోతుంది కాబట్టే.. ఈ విధానాన్ని ఉపయోగించుకోవాలని చెబుతున్నానని.. ధోనిని పూర్తిగా వదులుకోమని చెప్పట్లేదని వెల్లడించాడు.

Also Read: ఐపీఎల్ 2021: మారనున్న టీమ్స్ రూపురేఖలు.. మెగా ఆక్షన్‌లోకి ధోని, స్మిత్, విలియమ్సన్‌లు వచ్చే అవకాశం..