జో బైడెన్ కేబినెట్ లో వివేక్ మూర్తికి స్థానం ! మరో ఇండో-అమెరికన్ కి కూడా ! అస్మదీయులకు అందలం

అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్ కేబినెట్ లో ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు చోటు దక్కనుంది. ప్రస్తుతం కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్ కో-చైర్మన్లలో ఒకరిగా ఉన్న డాక్టర్ వివేక్ మూర్తికి..

జో బైడెన్ కేబినెట్ లో వివేక్ మూర్తికి స్థానం ! మరో ఇండో-అమెరికన్ కి కూడా ! అస్మదీయులకు అందలం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 18, 2020 | 1:15 PM

అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్ కేబినెట్ లో ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు చోటు దక్కనుంది. ప్రస్తుతం కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్ కో-చైర్మన్లలో ఒకరిగా ఉన్న డాక్టర్ వివేక్ మూర్తికి, మరో ప్రొఫెసర్ అరుణ్ మజుందార్ కు మంత్రి పదవులు లభిస్తాయని అంటున్నారు. వివేక్ మూర్తిని ఆరోగ్య, మానవ సర్వీసుల శాఖ మంత్రిగా, స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అరుణ్ మజుందార్ ను ఇంధన శాఖ మంత్రిగా బైడెన్ నియమించవచ్ఛు. అమెరికాలో కరోనా వైరస్ వ్యవహారాల్లో వివేక్ మూర్తి బైడెన్ కి విలువైన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. 2014 లో బరాక్ ఒబామా అధ్యక్షునిగా ఉన్నప్పుడు  వివేక్ మూర్తి 19 వ యుఎస్ సర్జన్ జనరల్ గా పని చేశారు.