AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తుంగభద్ర పుష్కరాలపై గైడ్‌లైన్స్‌ విధించిన ప్రభుత్వం, నెగటివ్‌ రిపోర్ట్‌తో వచ్చినవారికే అనుమతి

తుంగభద్ర పుష్కరాలపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.. ఇంతకు ముందులా ఎవరుపడితే వారు పుష్కరాలకు వెళ్లడానికి వీలులేదు.. ఎప్పుడుపడితే అప్పుడు నదిలో..

తుంగభద్ర పుష్కరాలపై గైడ్‌లైన్స్‌ విధించిన ప్రభుత్వం, నెగటివ్‌ రిపోర్ట్‌తో వచ్చినవారికే అనుమతి
Balu
|

Updated on: Nov 18, 2020 | 11:54 AM

Share

తుంగభద్ర పుష్కరాలపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.. ఇంతకు ముందులా ఎవరుపడితే వారు పుష్కరాలకు వెళ్లడానికి వీలులేదు.. ఎప్పుడుపడితే అప్పుడు నదిలో మునకలేస్తామన్నా కుదరదు.. ఈ నెల 20 నుంచి డిసెంబర్‌ ఒకటి వరకు జరగే తుంగభద్ర పుష్కరాలకు ఏర్పాట్లు చేస్తూనే కొన్ని గైడ్‌లైన్స్‌ను పెట్టింది ప్రభుత్వం. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకే నదిలో స్నానమాచరించవచ్చు.. ఆ తర్వాత ఎవరినీ రానివ్వరు. అలాగే పదేళలోపు పిల్లలను, గర్భిణీలను, 65 ఏళ్ల పైబడినవారిని అనుమించేది లేదని స్పష్టం చేశారు అధికారులు.. కరోనా నెగిటివ్‌ రిపోర్ట్‌తో వచ్చినవారినే పుష్కర ఘాట్లలోకి రానిస్తారు.. టెస్ట్‌ రిపోర్టు లేకుండా వచ్చే వారికి థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి ఆ తర్వాత అనుమతి ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. ఏ మాత్రం కరోనా లక్షణాలు ఉన్నా పుష్కర ఘాట్లకు అనుమతినివ్వరు. పుష్క‌ర‌ఘాట్లు, ఆల‌య ప్ర‌వేశ ద్వారాల దగ్గర శానిటైజ‌ర్లు, థ‌ర్మ‌ల్ స్ర్కీనింగ్ త‌ప్ప‌నిస‌రి చేశారు. పుష్కరాల కోసం వచ్చేవారు మాస్కు తప్పనిసరిగా ధరించాలి.. అలాగే ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలి. కొవిడ్ నిబంధ‌న‌ల‌కు లోబ‌డి పుష్క‌ర స్నానాల‌కు అనుమ‌తి ఇవ్వ‌నున్నారు.

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..