AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బోర్డు పరీక్షల్లో టాపర్లకు కార్లు కానుక ఇచ్చిన మంత్రి

జార్ఖండ్ రాష్ట్ర మంత్రి తన గొప్ప మనస్సును చాటుకున్నారు. ఉత్తమ విద్యార్థులు కానుకలు అందజేశారు. జార్ఖండ్ అకాడమిక్ కౌన్సిల్‌ నిర్వ‌హించిన 10వ త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి బోర్డు ప‌రీక్ష‌ల్లో టాప‌ర్లుగా నిలిచిన విద్యార్థుల‌కు ఆ రాష్ర్ట విద్యాశాఖ మంత్రి జ‌గ‌ర్నాథ్ మ‌హ‌తో కార్ల‌ను బ‌హుమ‌తిగా ప్రదానం చేశారు.

బోర్డు పరీక్షల్లో టాపర్లకు కార్లు కానుక ఇచ్చిన మంత్రి
Balaraju Goud
|

Updated on: Sep 23, 2020 | 6:25 PM

Share

జార్ఖండ్ రాష్ట్ర మంత్రి తన గొప్ప మనస్సును చాటుకున్నారు. ఉత్తమ విద్యార్థులు కానుకలు అందజేశారు. జార్ఖండ్ అకాడమిక్ కౌన్సిల్‌ నిర్వ‌హించిన 10వ త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి బోర్డు ప‌రీక్ష‌ల్లో టాప‌ర్లుగా నిలిచిన విద్యార్థుల‌కు ఆ రాష్ర్ట విద్యాశాఖ మంత్రి జ‌గ‌ర్నాథ్ మ‌హ‌తో కార్ల‌ను బ‌హుమ‌తిగా ప్రదానం చేశారు. జార్ఖండ్‌ బోర్డు పరీక్షల్లో టాప్ లో నిలిచిన విద్యార్థులకు కార్లను కానుకగా ఇస్తానని హామీ ఇచ్చారు. ఫలితాల వెలువడి వెంటనే తను ఇచ్చిన హామీ మేరకు కార్లను విద్యార్థులకు కార్లను అందజేశారు.

జార్ఖండ్‌ బోర్డు పరీక్ష ఫలితాలను జూలైలో ప్రకటించారు. ఫలితాల ప్రకటన సమయంలో టాపర్ల పేర్లను ప్రకటించలేదు. ఫ‌లితాల ప్ర‌క‌ట‌న వెలువడిన స‌మ‌యంలో కార్లు బ‌హుమతిగా అంద‌జేయనున్న‌ట్లు మంత్రి తెలిపారు. జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు దివంగత బినోద్ బిహారీ మహాతో జయంతి సందర్భంగా మంత్రి బుధవారం టాప‌ర్ల‌కు కార్ల కీలను అందజేశారు. ప‌దో త‌ర‌గ‌తి మాత్ర‌మే చ‌దివిన విద్యాశాఖ మంత్రి జ‌గ‌ర్నాథ్ త‌న విద్యాభ్యాసాన్ని కొన‌సాగిస్తున్నారు. చ‌దువుకునేందుకు వ‌య‌స్సుతో ప‌నిలేద‌న్న ఆయ‌న ఇంట‌ర్మీడియ‌ట్‌లో అడ్మిట్ అయ్యారు.

బోర్డు పరీక్షలలో బాగా రాణించే విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇతర రాష్ట్రాలు సైతం ఇటువంటి ప్రోత్స‌హాకాల‌నే ప్ర‌క‌టించాయి. అసోంలో 75% మార్కులు సాధించిన విద్యార్థులకు ఆనందరామ్ బోరూహ్ అవార్డు కింద రూ. 20 వేల నగదు బహుమతి అంద‌జేస్తున్నారు. ప్రగ్యాన్ భారతి పథకం కింద 12 వ తరగతి బోర్డు పరీక్షల్లో ఫ‌స్ట్ క్లాస్ డివిజ‌న్ సాధించిన 22 వేల మంది బాలికలకు స్కూటీలు కానుకగా ఇస్తున్నారు. హర్యానా విద్యా మంత్రి ఓం ప్రకాష్ యాదవ్ 12 వ తరగతి బోర్డు పరీక్షలలో రాష్ట్ర టాపర్‌కు రూ. 21 వేల నగదు బ‌హుమ‌తిగా ఇవ్వ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం 10, 12వ త‌ర‌గ‌తి టాపర్లకు రూ .1 లక్ష నగదు, ల్యాప్‌టాప్ బహుమతిగా ప్రకటించింది.

Follow Us
మీరు ఉద్యోగం మానేశారా..? కేంద్రం నుంచి ప్రతీ నెలా అకౌంట్లోకి..
మీరు ఉద్యోగం మానేశారా..? కేంద్రం నుంచి ప్రతీ నెలా అకౌంట్లోకి..
 ధోనీ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ అయ్యర్
 ధోనీ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ అయ్యర్
పావు ఎకరం నుంచి నెలకు రూ.30 వేలు అర్జిస్తున్న రైతు..
పావు ఎకరం నుంచి నెలకు రూ.30 వేలు అర్జిస్తున్న రైతు..
ఈసారి GATE 2027లో కొత్తగా రోబోటిక్స్ పేపర్‌.. ఈ పరీక్ష సిలబస్ ఇదే
ఈసారి GATE 2027లో కొత్తగా రోబోటిక్స్ పేపర్‌.. ఈ పరీక్ష సిలబస్ ఇదే
స్టార్ హీరో కావాల్సిన యశో ఎలా చనిపోయాడో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
స్టార్ హీరో కావాల్సిన యశో ఎలా చనిపోయాడో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
శుభ రోజున తలస్నానం తప్పనిసరి ఎందుకు? పూర్వీకులు చెప్పిన ఈ రహస్యం
శుభ రోజున తలస్నానం తప్పనిసరి ఎందుకు? పూర్వీకులు చెప్పిన ఈ రహస్యం
జస్ట్ దరఖాస్తు చేసుకుంటే.. ఒకేసారి మీ అకౌంట్లోకి రూ.15 లక్షలు
జస్ట్ దరఖాస్తు చేసుకుంటే.. ఒకేసారి మీ అకౌంట్లోకి రూ.15 లక్షలు
ఎయిర్ పోర్టులో టాలీవుడ్ హీరోయిన్.. సింపుల్ లుక్‌లోనే మతులు పోగొడు
ఎయిర్ పోర్టులో టాలీవుడ్ హీరోయిన్.. సింపుల్ లుక్‌లోనే మతులు పోగొడు
భారత్‌లో త్వరలో కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఎంత ఖర్చంటే..?
భారత్‌లో త్వరలో కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఎంత ఖర్చంటే..?
ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే
ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే