కరోనా కల్లోలానికి దేశం విలవిలాడుతోంది. సామాన్యుడి నుంచి ప్రజా ప్రతినిధుల దాకా కరోనా ధాటికి అల్లాడిపోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొవిడ్ సోకుతోంది. తాజాగా జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కరోనా ప్రభావానికి గురయ్యారు.
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తనకు తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు, సిబ్బందిని కూడా హోం క్వారంటైన్ లో ఉండాలని సీఎం సూచించారు. ఇక సీఎం కార్యాలయానికి వచ్చే విజిటర్స్ పై అంక్షలు విధించారు. సీఎం కార్యాలయ రాకపోకలపై నిషేధం విధించారు. ఆ రాష్ర్ట మంత్రి మిథిలేష్ ఠాకూర్ కు మంగళవారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇటీవలే ఆ మంత్రి సీఎం సోరెన్ తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో సీఎం స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ముఖ్యమంత్రికి ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ స్వీయ నిర్భందంలోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు జార్ఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా 3,056 మందికి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, 22 మంది ప్రాణాలు కోల్పోయారు. .