
JEE Main Exams: కరోనా విరామం అనంతరం రేపటి నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్ పరీక్షలు పన్నెండు విడతల్లో నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రంగం సిద్దం చేసింది. ఇక ఈ పరీక్షకు తెలంగాణలో 27 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుమారు 67,319 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా.. వారందరూ కూడా పరీక్ష సమయానికి అరగంట ముందే చేరుకోవాలని.. లేదంటే గేట్లు మూసివేస్తారని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగే పరీక్షకు.. విద్యార్ధులను ఉదయం 7.20 నిమిషాల నుంచే అనుమతిస్తామని.. 8:30 కల్లా గేట్లు మూసివేస్తామని పేర్కొంది. ఇక మధ్యాహ్నం పరీక్షకు కూడా ఇదే విధానం అమలవుతుందని తెలిపింది.
ఇదిలా ఉంటే జేఈఈ మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు తమకు గత 14 రోజులుగా ఎలాంటి కరోనా లక్షణాలు లేవని సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని ఎన్టీఏ పేర్కొంది. తమ అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ ఫార్మ్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత.. దానిపై ఫోటో అంటించి సంతకంతో పాటు ఎడమ చేతి బొటన వేలిముద్రను కూడా వేయాలని వివరించింది.
Also Read:
‘వైఎస్సార్ బీమా’ పధకం విధి విధానాలు.. జిల్లాల వారీగా ఫోన్ నెంబర్లు.!
ఏపీ: 1036 గ్రామ, వార్డు వాలంటీర్ల పోస్టులు.. వెంటనే దరఖాస్తు చేసుకోండిలా.!
”టాలీవుడ్‌లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవు”..
IPL 2020: ఒకే టీంలో కోహ్లీ, డివిలియర్స్, స్మిత్‌లు.. ఎప్పుడంటే..
సంచలన నిర్ణయం దిశగా జగన్ సర్కార్.. ఆన్‌లైన్ రమ్మీపై నిషేధం.!