జనసేన ఆవిర్భావ రోజు.. నిరాశలో కార్యకర్తలు..

Janasena Party: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ నేడు ఆరో ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోనుంది. 2014 మార్చి 14 పవన్ ఈ పార్టీని స్థాపించారు. గతంలో పార్టీ వార్షికోత్సవాన్ని కార్యకర్తలు ఎంతో ఆర్భాటంగా జరుపుకున్నారు. 2018లో రాజమండ్రి వేదికగా.. 2019లో గుంటూరు వేదికగా జనసేన ఆవిర్భావ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇక ఈసారి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఏపీలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో […]

జనసేన ఆవిర్భావ రోజు.. నిరాశలో కార్యకర్తలు..

Updated on: Mar 14, 2020 | 2:10 PM

Janasena Party: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ నేడు ఆరో ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోనుంది. 2014 మార్చి 14 పవన్ ఈ పార్టీని స్థాపించారు. గతంలో పార్టీ వార్షికోత్సవాన్ని కార్యకర్తలు ఎంతో ఆర్భాటంగా జరుపుకున్నారు. 2018లో రాజమండ్రి వేదికగా.. 2019లో గుంటూరు వేదికగా జనసేన ఆవిర్భావ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇక ఈసారి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నిర్వహిస్తామని ప్రకటించారు.

అయితే ప్రస్తుతం ఏపీలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఆ కోడ్ అమలులో ఉన్నప్పుడు 144 సెక్షన్‌తో పాటు పార్టీ పరంగా జరిగే బహిరంగ సభలన్నింటిని కొన్ని షరతులు వర్తిస్తాయి. దీని వల్ల పార్టీ కార్యకర్తలు కాస్త నిరాశకు గురైన.. ఈ ఏడాది ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సింపుల్‌గా నిర్వహించాలని.. పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.

ఇదిలా ఉంటే ఇవాళ ఉదయం 11 గంటలకు పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు ధవళేశ్వరంలోని శ్రీరామపాదాల రేవులో గోదావరి నదికి హారతి ఇచ్చి ‘మన నుడి – మన నది’ కార్యక్రమం చేపట్టనున్నారు. అటు 15వ తేదీన సామాజిక వేత్తలతో భేటీ కానున్న పవన్ రాష్ట్ర పరిస్థితులపై చర్చించనున్నారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికలలో అభ్యర్థులు గెలుపు కోసం కష్టపడాలని.. వీలుంటేనే హాజరు కావాలని కార్యకర్తలకు, నేతలకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి పి. హరిప్రసాద్ పిలుపునిచ్చారు.

For More News:

భారత్ లో రెండో కరోనా మరణం…

గుడ్ న్యూస్.. గాంధీ నుంచి కరోనా బాధితుడు డిశ్చార్జ్

ఏపీలో కరోనా అలెర్ట్.. పాఠశాలలు, థియేటర్లు బంద్..

దోపిడీలు.. బెదిరింపులు.. భూకబ్జాలు.. రేవంత్ ‘మిస్టర్ అరాచక్’!

వాహనదారులకు కేంద్రం షాక్.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంపు…

కరోనా ప్రభావం.. ఆసీస్, కివీస్ వన్డే సిరీస్ రద్దు..

గుడ్ న్యూస్.. కరోనా‌కు వ్యాక్సిన్ దొరికేసిందోచ్..

కివీస్ ఆటగాడికి కరోనా వైరస్.. ఆందోళనలో క్రికెట్ బోర్డు..

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 11 మంది మృతి..

జగన్ సర్కార్‌కు ఈసీ షాక్.. ఎందుకంటే.?