దోపిడీలు.. బెదిరింపులు.. భూకబ్జాలు.. రేవంత్ ‘మిస్టర్ అరాచక్’!

Congress MP: అక్రమాలు.. అరాచకాలు.. భూకబ్జాలు.. ఇలా ఒకటేమిటి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చిట్టాలో చాలానే ఉన్నాయి. ఇక ఈ అక్రమాలను కూపీ లాగుతోంది టీఆర్ఎస్ పార్టీ. తాజాగా భూ కబ్జా ఆరోపణలతోపాటు అనుమతి లేకుండా డ్రోన్ వినియోగించారన్న ఆరోపణలతో రిమాండ్ ఖైదీగా వున్న రేవంత్ రెడ్డి విషయంపై అటు ఢిల్లీలోనూ, ఇటు హైదరాబాద్‌లోనూ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు గులాబీ నేతలు. రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ నేతలే విరుచుకుపడుతున్నారు. అతడు చేసేవన్నీ చిల్లర వేషాలు.. ఛీపేవి […]

  • Updated On - 2:10 pm, Sat, 14 March 20
దోపిడీలు.. బెదిరింపులు.. భూకబ్జాలు.. రేవంత్ ‘మిస్టర్ అరాచక్’!


Congress MP: అక్రమాలు.. అరాచకాలు.. భూకబ్జాలు.. ఇలా ఒకటేమిటి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చిట్టాలో చాలానే ఉన్నాయి. ఇక ఈ అక్రమాలను కూపీ లాగుతోంది టీఆర్ఎస్ పార్టీ. తాజాగా భూ కబ్జా ఆరోపణలతోపాటు అనుమతి లేకుండా డ్రోన్ వినియోగించారన్న ఆరోపణలతో రిమాండ్ ఖైదీగా వున్న రేవంత్ రెడ్డి విషయంపై అటు ఢిల్లీలోనూ, ఇటు హైదరాబాద్‌లోనూ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు గులాబీ నేతలు.

రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ నేతలే విరుచుకుపడుతున్నారు. అతడు చేసేవన్నీ చిల్లర వేషాలు.. ఛీపేవి బడా నీతులని మండిపడుతున్నారు. అడ్డమైన కేసుల్లో చీటికీ మాటీకి జైలుకెళ్లే ఈ లీడర్.. ఏదో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ఫీలింగ్‌ ఇవ్వడం చూసి అటు పార్టీ సీనియర్లు.. ఇటు జనాలు విసుగెత్తిపోయారు. ఇక ఈ కబ్జాకోరు అరాచకాల గురించి ప్రజలే కథలు కథలుగా చెబుతున్నారు. బెదిరింపులు.. కిడ్నాపింగ్‌లు, ఎక్స్‌టార్షన్లు, లాండ్‌ గ్రాబింగ్‌లు ఇలా చెప్పుకుంటూపోతే.. ఈ చోటా లీడర్‌ కహానీ… ‘బహుత్‌ బడా హై’ అని జనాలు అంటున్నారు.

రేవంత్‌ కేసుల చిట్టా తీస్తే.. మనిషన్నోడు ఇన్ని కేసుల్లో ఇరుక్కుంటాడా అనిపిస్తుంది. ఇప్పటివరకు రేవంత్‌ రెడ్డిపై మొత్తం 63 కేసులున్నాయి. వాటిలో జనాలను రెచ్చగొట్టిన కేసులే 32 ఉన్నాయి. ఇక ఫోర్జరీ కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, భూకబ్జాలు, ఆదేశాల ఉల్లంఘన కేసులు కూడా రేవంత్‌ మీద 30కి పైగానే నమోదయ్యాయి. దళితులకు పట్టెడు అన్నం కూడా పెట్టని రేవంత్‌. వారి నోటి నుంచి కూడు లాక్కున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. దళితసంఘాలు, గిరిజన సంఘాలు ఎన్నోమార్లు రేవంత్‌ అరాచకాలపై పోరాడాయి.. కాని ఫలితం లేకపోయింది. తన పలుకుబడితో వారిపై ఉక్కుపాదం మోపాడు రేవంత్‌. గోపన్‌పల్లి బాధితులే ఇందుకు నిదర్శనం.

For More News:

భారత్ లో రెండో కరోనా మరణం…

గుడ్ న్యూస్.. గాంధీ నుంచి కరోనా బాధితుడు డిశ్చార్జ్

ఏపీలో కరోనా అలెర్ట్.. పాఠశాలలు, థియేటర్లు బంద్..

జనసేన ఆవిర్భావ రోజు.. నిరాశలో కార్యకర్తలు..

వాహనదారులకు కేంద్రం షాక్.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంపు…

కరోనా ప్రభావం.. ఆసీస్, కివీస్ వన్డే సిరీస్ రద్దు..

గుడ్ న్యూస్.. కరోనా‌కు వ్యాక్సిన్ దొరికేసిందోచ్..

కివీస్ ఆటగాడికి కరోనా వైరస్.. ఆందోళనలో క్రికెట్ బోర్డు..

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 11 మంది మృతి..

జగన్ సర్కార్‌కు ఈసీ షాక్.. ఎందుకంటే.?