ఏపీ హైకోర్టు సంచలన తీర్పుపై పవన్ ఏమన్నారంటే..!

|

May 29, 2020 | 1:19 PM

ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు ఊరటను కలిగిస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎన్నికల కమిషనర్ తొలగిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ రద్దయిందని.. ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసిందని జనసేనాని పేర్కొన్నారు. ఈ తీర్పు ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకి మరింత విశ్వాసాన్ని పెంచిందన్నారు. ”ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు […]

ఏపీ హైకోర్టు సంచలన తీర్పుపై పవన్ ఏమన్నారంటే..!
Follow us on

ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు ఊరటను కలిగిస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎన్నికల కమిషనర్ తొలగిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ రద్దయిందని.. ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసిందని జనసేనాని పేర్కొన్నారు. ఈ తీర్పు ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకి మరింత విశ్వాసాన్ని పెంచిందన్నారు.

”ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ ,ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు, రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది,అలాగే ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకి విశ్వాసం ఇనుమడింపజేసింది” అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

Read This: తెలంగాణలో జూలై 5 తర్వాతే పాఠశాలలు ప్రారంభం..?