భారత్‌లో… జైషే మహ్మద్ ఉగ్రవాదులు!

| Edited By:

Aug 04, 2019 | 6:46 PM

భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. పాకిస్థాన్ సైన్యానికి చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్‌, ఉగ్రవాదులు అనేక మార్గాల్లో భారత దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. నియంత్రణ రేఖ వెంబడి జరుగుతున్న ఇటువంటి చొరబాటు యత్నాలను భారత సైన్యం విజయవంతంగా విఫలం చేస్తోంది. గత వారం దాదాపు నాలుగుచోట్ల పాకిస్థాన్ బీఏటీ సైనికులు చేసిన చొరబాటు యత్నాలను విఫలం చేసింది. కానీ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన సుమారు ఐదుగురు ఉగ్రవాదులు కశ్మీరులో చొరబడినట్లు […]

భారత్‌లో... జైషే మహ్మద్ ఉగ్రవాదులు!
Follow us on
భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. పాకిస్థాన్ సైన్యానికి చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్‌, ఉగ్రవాదులు అనేక మార్గాల్లో భారత దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. నియంత్రణ రేఖ వెంబడి జరుగుతున్న ఇటువంటి చొరబాటు యత్నాలను భారత సైన్యం విజయవంతంగా విఫలం చేస్తోంది. గత వారం దాదాపు నాలుగుచోట్ల పాకిస్థాన్ బీఏటీ సైనికులు చేసిన చొరబాటు యత్నాలను విఫలం చేసింది. కానీ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన సుమారు ఐదుగురు ఉగ్రవాదులు కశ్మీరులో చొరబడినట్లు విశ్వసనీయ వర్గాల చెప్పాయి.
తాజాగా… నలుగురు లేదా ఐదుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరు నుంచి వచ్చి, మన దేశ భూభాగంలోకి చొరబడినట్లు తెలుస్తోంది. ఈ సమాచారాన్ని క్షేత్ర స్థాయిలోని భద్రతా దళాలకు చేరవేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం భారత్, పాక్ దళాల మధ్య భారీగా కాల్పులు జరుగుతున్నట్లు పేర్కొన్నాయి. పాకిస్థాన్ సైన్యం జరుపుతున్న కాల్పులను ఎదుర్కొనేందుకు భారత సైన్యం బోఫోర్స్ తుపాకులను వాడవలసి వచ్చిందని జమ్మూ-కశ్మీరు గవర్నర్ సత్యపాల్ మాలిక్ చెప్పారు.