నాగశౌర్య సినిమాలో జగ్గూభాయ్..!

నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జగపతిబాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

నాగశౌర్య సినిమాలో జగ్గూభాయ్..!
Ravi Kiran

|

Sep 04, 2020 | 2:31 PM

Naga Shourya’s Next Movie: నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. నాగ‌శౌర్య 20వ చిత్రంగా వస్తున్న ఈ మూవీ ప్రీ-లుక్, ఫస్ట్ లుక్‌లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ప్రాచీన విలువిద్య నేపథ్యంలో ఈ మూవీ ఉంటుంద‌ని స‌మాచారం. అన్ని కమర్షియల్ హంగులు ఈ చిత్రంలో ఉంటాయని నిర్మాతలు చెబుతున్నారు. కాగా. ఈ సినిమాలో జగపతిబాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. చిత్రంలో జగ్గూభాయ్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందట. ఈ సినిమాలో కేతికా శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ సెట్స్ పైకి త్వరలోనే వెళ్లనుంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu