పూరీ ఆలయానికి డ్యామేజ్

ఇటీవల వచ్చిన ఫొని తుఫాను ఒడిశా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ తుఫాను వలన భారీ ఆస్తి నష్టం జరగగా.. పలువురు మరణించారు. కాగా ఈ తుఫాను వలన ప్రఖ్యాత పూరీ జగన్నాథ్ ఆలయం కొంతమేర దెబ్బతిన్నదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరక్టర్ జనరల్ ఉషా శర్మ తెలిపారు. ఆలయంలో కొన్ని చోట్ల పెచ్చు ఊడిపోయాయని ఆమె పేర్కొన్నారు. పూరీ జగన్నాథుడి రథయాత్ర కంటే ముందే అవసరమైన అన్ని మరమ్మత్తులను పూర్తి చేస్తామని […]

పూరీ ఆలయానికి డ్యామేజ్

Edited By:

Updated on: May 11, 2019 | 6:35 PM

ఇటీవల వచ్చిన ఫొని తుఫాను ఒడిశా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ తుఫాను వలన భారీ ఆస్తి నష్టం జరగగా.. పలువురు మరణించారు. కాగా ఈ తుఫాను వలన ప్రఖ్యాత పూరీ జగన్నాథ్ ఆలయం కొంతమేర దెబ్బతిన్నదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరక్టర్ జనరల్ ఉషా శర్మ తెలిపారు. ఆలయంలో కొన్ని చోట్ల పెచ్చు ఊడిపోయాయని ఆమె పేర్కొన్నారు. పూరీ జగన్నాథుడి రథయాత్ర కంటే ముందే అవసరమైన అన్ని మరమ్మత్తులను పూర్తి చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు. అలాగే కోణార్క్ సూర్య దేవాలయం గార్డెన్ కూడా ధ్వంసమైందని, దాదాపు 210 భారీ వృక్షాలు నేలకొరిగాయని ఆమె అన్నారు.