IT returns filing in full swing: ఒకేసారి భారీగా పెరిగిన ఐటీ రిటర్న్ దాఖలు.. చివరి తేది దగ్గర పడుతుండడమే కారణం..

|

Dec 29, 2020 | 5:35 PM

పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం పొందుతున్న ప్రతీ వ్యక్తి ఐటీఆర్‌ను (ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్) దాఖలు చేయాలనే విషయం తెలిసిందే. నిజానికి ఐటీ రిటర్న్ దాఖలు చివరి తేది సహజంగా జూలై 31 తేదీగా ఉంటుంది. కానీ కరోనా నేపథ్యంలో...

IT returns filing in full swing: ఒకేసారి భారీగా పెరిగిన ఐటీ రిటర్న్ దాఖలు.. చివరి తేది దగ్గర పడుతుండడమే కారణం..
Follow us on

ITR 2019-20 filing: పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం పొందుతున్న ప్రతీ వ్యక్తి ఐటీఆర్‌ను (ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్) దాఖలు చేయాలనే విషయం తెలిసిందే. నిజానికి ఐటీ రిటర్న్ దాఖలు చివరి తేది సహజంగా జూలై 31 తేదీగా ఉంటుంది. కానీ కరోనా నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) ఈ తేదీని డిసెంబర్ 31కి మార్చింది. దీంతో చివరి తేదీకి కేవలం రెండు రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో పన్ను చెల్లింపులు దారులు భారీగా ఐటీ రిటర్న్ దాఖలు చేస్తున్నారు.


ఈ విషయాన్ని ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. కేవలం మంగళవారం ఒక్కరోజులోనే (సాయంత్రం నాలుగు వరకు) 7,65,836 మంది ఐటీ రిటర్న్‌ దాఖలు చేయగా.. కేవలం గంట వ్యవధిలోనే 1,35,408 మంది రిటర్న్ దాఖలు చేశారని తెలిపింది. ఇక పూర్తి వివరాలకు https://bit.ly/2YgCyk3 సంప్రదించమని ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇదిలా ఉంటే ఐటీ రిటర్న్ దాఖలు తేదీని మరోసారి పొడగించమని పలు కంపెనీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో డిసెంబర్ 31 చివరి తేది కానుంది.

Also read: మీరు ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేశారా..? అయితే మీకు ఇదే చివ‌రి గ‌డువు.. లేక‌పోతే..