Breaking: పబ్జీ సహా 47 యాప్‌లపై నిషేధం..!

పబ్జీ ఫ్యాన్స్‌కి ఇది నిజంగా బ్యాడ్‌ న్యూస్‌. త్వరలోనే పబ్జీని బ్యాన్ చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

Breaking: పబ్జీ సహా 47 యాప్‌లపై నిషేధం..!

Edited By:

Updated on: Jul 27, 2020 | 1:53 PM

PUBG Ban: పబ్జీ ఫ్యాన్స్‌కి ఇది నిజంగా బ్యాడ్‌ న్యూస్‌. త్వరలోనే పబ్జీని బ్యాన్ చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దాంతో పాటు చైనాతో సంబంధం ఉన్న 275 యాప్‌లను నిషేధించడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఈ క్రమంలో వాటి జాబితాను తయారు చేసి ఉంచినట్లు తెలుస్తోంది. అందులో 47 యాప్‌లను నిషేధించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. అందులో పబ్‌జీ మొబైల్‌, లూడో వాల్డ్, ఇ-కామర్స్‌ ఫ్లాట్‌ఫామ్‌ అలీ ఎక్స్‌ప్రెస్‌, జిలీ, బైట్‌ డ్యాన్స్‌కు చెందిన మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ యాప్‌ రెస్సో లాంటివి ఉండొచ్చని సమాచారం. కాగా దేశ భద్రత, రక్షణ దృష్ట్యా ఇప్పటికే చైనాకు చెందిన 59 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది. దీంతో డ్రాగన్ కంట్రీపై డిజిటల్ స్ట్రైక్‌ని ప్రకటించిన భారత్‌.. ఆ దేశ ఆదాయానికి గండి కొట్టింది. ఇక భారత్‌ను ఫాలో అవుతూ చైనా యాప్‌లను నిషేధించాలని అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు సైతం ట్రంప్‌కు ఇటీవల లేఖ రాసిన విషయం తెలిసిందే.

Read This Story Also: భార‌త్ క‌రోనా తీవ్ర‌త‌రం.. 14 ల‌క్ష‌లు దాటేసిన కేసులు..