భారత్‌లో అనుబంధ విభాగాన్ని ప్రారంభించిన ‘ఐసిస్’!

పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంతో ఇబ్బంది పడుతున్న భారత్‌కు మరో కొత్త తలనొప్పి ఎదురయింది. భారత్‌లో పూర్తిస్థాయి విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కిరాతక ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్) ప్రకటించింది. దీనికి విలాయా ఆఫ్ హింద్(ఇండియా స్టేట్-ఇస్లామిక్ స్టేట్ తరహాలో) అని పేరు పెట్టింది. ఈ విషయాన్ని తమ అధికారిక వార్తాసంస్థ అమాక్ ద్వారా ఐసిస్ ప్రకటించింది. అయితే విలాయా ఆఫ్ హింద్ భౌగోళిక పరిధిపై ఐసిస్ స్పష్టత ఇవ్వలేదు. తమ సైనికులు జమ్మూకశ్మీర్ […]

భారత్‌లో అనుబంధ విభాగాన్ని ప్రారంభించిన 'ఐసిస్'!
Follow us

| Edited By:

Updated on: May 12, 2019 | 6:12 PM

పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంతో ఇబ్బంది పడుతున్న భారత్‌కు మరో కొత్త తలనొప్పి ఎదురయింది. భారత్‌లో పూర్తిస్థాయి విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కిరాతక ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్) ప్రకటించింది. దీనికి విలాయా ఆఫ్ హింద్(ఇండియా స్టేట్-ఇస్లామిక్ స్టేట్ తరహాలో) అని పేరు పెట్టింది. ఈ విషయాన్ని తమ అధికారిక వార్తాసంస్థ అమాక్ ద్వారా ఐసిస్ ప్రకటించింది.

అయితే విలాయా ఆఫ్ హింద్ భౌగోళిక పరిధిపై ఐసిస్ స్పష్టత ఇవ్వలేదు. తమ సైనికులు జమ్మూకశ్మీర్ లో భద్రతాబలగాలతో పోరాడుతున్నారని ఐసిస్ ఆ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ప్రకటనను జమ్మూకశ్మీర్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు ఖండించారు. పశ్చిమాసియాలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో ఉనికిని చాటుకునేందుకు ఐసిస్ ఇలాంటి ప్రకటనలు చేస్తోందని అభిప్రాయపడ్డారు. భారత్ లో ఐసిస్ ఉనికి లేదని ఆయన తేల్చిచెప్పారు.