AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCI Central Contracts: ఇదెక్కడి అన్యాయం అగార్కర్ భయ్యా.. తుఫాన్ ప్లేయర్‌కు ఇలా హ్యాండిస్తారా..?

BCCI Central Contracts List 2026: గత సంవత్సరం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో 34 మంది ఆటగాళ్లు ఉండగా.. ఈసారి 30 మంది ఆటగాళ్లను మాత్రమే ఈ జాబితాలో చేర్చారు. రోహిత్, కోహ్లీ గ్రేడ్స్ తగ్గించగా.. మొత్తంగా నలుగురు ఆటగాళ్లకు మొండిచేయి చూపించారు.

BCCI Central Contracts: ఇదెక్కడి అన్యాయం అగార్కర్ భయ్యా.. తుఫాన్ ప్లేయర్‌కు ఇలా హ్యాండిస్తారా..?
Ishan Kishan
Venkata Chari
|

Updated on: Feb 07, 2026 | 10:51 AM

Share

Ishan Kishan excluded from BCCI central contract: నేటి నుంచి 2026 టీ20 ప్రపంచకప్ భారత్, శ్రీలంక దేశాల్లో సంయుక్తంగా జరగనుంది. తొలిరోజే భారత జట్టు రంగంలోకి దిగనుంది. అమెరికాను ఢీ కొట్టేందుకు సూర్యసేన సారధ్యంలోని భారత జట్టు రెడీగా ఉంది. అయితే, ఈ సమయంలో బీసీసీఐ ఆటగాళ్లకు గుడ్ న్యూస్ చెప్పనుంది. సెంట్రల్ కాంట్రాక్ట్ లను విడుదల చేయనుందని వార్తలు వినిస్తున్నాయి. ఇప్పటి 30 మందితో ఓ లిస్ట్ రెడీ అయిందని తెలుస్తోంది. ఇందులో కొంతమందికి గుడ్ న్యూస్ అందగా, మరికొందరికి మాత్రం బ్యాడ్ న్యూస్ రానుంది. బీసీసీఐ ఎవ్వరికి హ్యాండిచ్చిందో ఓసారి చూద్దాం..

ఇషాన్ కిషన్ కు మొండిచేయి..

దేశవాళీలో దుమ్మురేపిన ఇషాన్ కిషన్.. అదే ఊపుతో టీ20 ఫార్మాట్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు. వరుస భారీ ఇన్నింగ్స్ లతో న్యూజిలాండ్ సిరీస్ ను అద్బుతంగా ప్రారంభించాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ 2026లోనూ చోటు దక్కించుకున్నాడు. అయితే, ఈ ఆటగాడి విషయంలో బీసీసీఐ మాత్రం కఠినంగా వ్యవరిస్తోందని మరోసారి రుజువైంది. గతేడాది సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి ఇషాన్ కిషన్ ను తప్పించిన బీసీసీఐ.. ఇప్పటి వరకు చోటివ్వలేదు. ఈ ఏడాది కూడా ఈ ప్లేయర్ కు మొండిచేయి చూపించినట్లు తెలుస్తోంది. ఇషాన్ కిషన్ తోపాటు మహ్మద్ షమీకి కూడా బీసీసీఐ హ్యాండిచ్చినట్లు తెలుస్తోంది.

30 మంది ఆటగాళ్లతో సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా..

అయితే, ఈసారి సెంట్రల్ కాంట్రాక్టుల కోసం మొత్తం 30 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారని ఓ నివేదిక పేర్కొంది. ఈ లిస్ట్ లో కీపర్ కం బ్యాటర్ ఇషాన్ కిషన్ పేరు లేదు. దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత ఇషాన్ ఇటీవలే టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్, టీ20 ప్రపంచ కప్ జట్లకూ ఎంపికయ్యాడు. కానీ, సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో మాత్రం చోటివ్వలేదు

అయితే, ఈ లిస్ట్ లో యంగ్ ప్లేయర్ సాయి సుదర్శన్‌ను కొత్తగా చేర్చారు. ఇషాన్‌తో పాటు మహ్మద్ షమీ ఈ లిస్ట్ నుంచి తప్పించారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియాకు దూరమైన షమీ.. గత కొన్ని నెలలుగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో మాటల యుద్ధం చేస్తున్నాడు. దీంతో షమీకి బీసీసీఐ డోర్ క్లోజ్ చేసిందని తెలుస్తోంది.

మరో యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ కూడా ఈ లిస్ట్ నుంచి తప్పించారు. సర్ఫరాజ్ చివరిసారిగా సి గ్రేడ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియా పర్యటన (2024-25) తర్వాత తిరిగి రాలేకపోయాడు. బెంగాల్ ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్, రజత్ పాటిదార్‌లను కూడా ఈసారి కేంద్ర కాంట్రాక్ట్ నుంచి మినహాయించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అయ్యో బిడ్డా.. ఆడుకుంటున్న బాలుడిపై దారుణంగా..
అయ్యో బిడ్డా.. ఆడుకుంటున్న బాలుడిపై దారుణంగా..
ఇదెక్కడి అన్యాయం అగార్కర్ భయ్యా.. తుఫాన్ ప్లేయర్‌కు హ్యాండిస్తారా
ఇదెక్కడి అన్యాయం అగార్కర్ భయ్యా.. తుఫాన్ ప్లేయర్‌కు హ్యాండిస్తారా
బంగారం ధరిస్తే.. ఈ రాశుల వారికి లెక్కలేనన్ని లాభాలు.. ఎదురులేదంతే
బంగారం ధరిస్తే.. ఈ రాశుల వారికి లెక్కలేనన్ని లాభాలు.. ఎదురులేదంతే
పండిన అరటి పండ్లతో దోసెలు.. వీటిని ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట
పండిన అరటి పండ్లతో దోసెలు.. వీటిని ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట
ఖర్జూరం,పాలు 15రోజులు తాగండి చాలు.. ఈ సమస్యలకి దూరంగా ఉండండి..!
ఖర్జూరం,పాలు 15రోజులు తాగండి చాలు.. ఈ సమస్యలకి దూరంగా ఉండండి..!
రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..
గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ
గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ