విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ‘ఫైటర్’ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ సిక్స్ ప్యాక్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా మూవీలో చేయబోయే ఫైట్స్ కోసం రౌడీ థాయ్‌లాండ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. కాగా, ఈ సినిమా షూటింగ్ ఇవాళ ముంబైలో మొదలైంది.
To new beginnings ?
Shoot begins in mumbai from today ??@TheDeverakonda @purijagan @karanjohar @PuriConnects @DharmaMovies #VD10 #PJ37 #PCfilm #PanIndia ? pic.twitter.com/BSEJxt0R1e— Charmme Kaur (@Charmmeofficial) January 20, 2020
ఇదిలా ఉంటే ఈ సినిమాలో మొదట హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ని ఎంపిక చేసింది చిత్ర యూనిట్. అయితే డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో జాన్వీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇక ఇప్పుడు మరో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి.. ఆమె ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తారా.? విజయ్ ప్రపోజల్‌ను యాక్సెప్ట్ చేస్తారా.? లేదా అన్నది వేచి చూడాలి. కాగా, అనన్య ‘స్టూడెంట్ అఫ్ ది ఇయర్ 2’తో బాలీవుడ్‌కు పరిచయమై.. ‘పతీ పత్నీ ఔర్ ఓ’ సినిమాతో హిట్ కొట్టింది. ప్రస్తుతం ‘ఖాలీ పీలి’ అనే చిత్రంలో నటిస్తోంది.