అండమాన్, నికోబార్ కేంద్రపాలిత ప్రాంతం భారతదేశంలోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి. నీలి ఆకాశం, సుదూరంగా విస్తరించి ఉన్న సముద్రం, మధ్యలో తెల్లని ఇసుక, ప్రతిచోటా పచ్చదనం.. సముద్రం మధ్యలో ఉన్న ఈ ద్వీపాల సమూహ సౌందర్యాన్ని ఎంత చూసినా తక్కువే అనిపిస్తుంది. ప్రకృతిలోని అందమైన దృశ్యాలను చూడడానికి అండమాన్-నికోబార్ కు వెళ్తారు. ఇది అత్యంత ఇష్టమైన ప్రదేశాలలో ఒకటి. నవ దంపతులు కూడా హనీమూన్ కి వెళ్ళడానికి ఇష్టపడతారు. ఈ నేపధ్యంలో IRCTC అంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అక్కడకు వెళ్లేందుకు ఒక ప్యాకేజీని ప్రారంభించింది.
IRCTC ఎప్పటికప్పుడు ప్రజలకు సరసమైన ధరలకు ప్రయాణ ప్యాకేజీలు అందిస్తుంది. ఇందులో రవాణా నుంచి సందర్శనా, ఆహారం, వసతి వరకు ఏర్పాట్లు అందిస్తారు. ఎవరైనా కుటుంబ స్నేహితులతో కలిసి అండమాన్ పర్యటనకు ప్లాన్ చేస్తుంటే లేదా ఒంటరిగా ప్రయాణించాలనుకుంటే.. IRCTCకి సంబంధించిన ఒక ప్యాకేజీని తీసుకోవచ్చు. కనుక ఈ రోజు IRCTC అందిస్తున్న ప్యాకేజీ వివరాలను గురించి తెలుసుకుందాం.
ప్యాకేజీ పేరు ఏమిటి? ఏ స్థలాలు కవర్ చేయబడతాయంటే?
అండమాన్ కోసం IRCTC ప్రారంభించిన ప్యాకేజీకి ‘అండమాన్ విత్ బార్టాంగ్ ఐలాండ్’ అని పేరు పెట్టారు. పోర్ట్ బ్లెయిర్, హేవ్‌లాక్ ద్వీపం, నీల్ ఐలాండ్‌లు ఈ ప్యాకేజీలో కవర్ చేయబడతాయి. రవాణాతో పాటు అల్పాహారంతో పాటు వసతి సౌకర్యాలు, రాత్రి భోజనం కూడా ఏర్పాటు చేయనున్నారు. IRCTC అందిస్తున్న ఈ ప్యాకేజీలో ప్రయాణీకుల బీమా కూడా కవర్ చేయబడుతుంది.
Dive into a paradise of sun, sea, and serenity with an epic holiday! Explore the mangrove creeks of Andaman & lots more with IRCTC tourism.
Destinations Discovered – Port Blair, Havelock, Neil Island
Package Price – ₹53,750/- onwards pp*Confirmed round flights included in… pic.twitter.com/G40EsVYzoL
— IRCTC (@IRCTCofficial) August 13, 2024
ప్రయాణానికి సంబంధించిన వివరాలు
అండమాన్, నికోబార్ సందర్శన కోసం ఈ ప్యాకేజీలో కోల్‌కతా నుంచి పోర్ట్ బ్లెయిర్ ద్వీపానికి విమానంలో ప్రయాణించవలసి ఉంటుంది. బదులుగా పోర్ట్ బ్లెయిర్ నుంచి కోల్‌కతాకు విమానంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీలో విమానంలో ప్రయాణం ఉదయం 05:50 ప్రారంభం అవుతుంది. ఉదయం 8 గంటలకు అక్కడికి చేరుకుంటారు. రెండవ విమానం ఉదయం 08:45కి, 10:45కి పోర్ట్ బ్లెయిర్ చేరుకుంటుంది.
ఈ ప్యాకేజీ ఎంత
అండమాన్ పర్యటన కోసం IRCTC అందిస్తున్న ఈ ప్యాకేజీ రూ. 53,750 నుండి ప్రారంభమవుతుంది. వ్యక్తుల వయస్సు, ప్రయాణీకుల సంఖ్యను బట్టి ప్యాకేజీ ధర పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఈ మొత్తం ట్రిప్ 5 పగళ్లు, 6 రాత్రులు ఉంటుంది. ఈ విధంగా IRCTC అందిస్తోన్న ప్యాకేజీతో అండమాన్, నికోబార్ ప్రయాణాన్ని జీవితంలో గుర్తుండిపోయేలా చేసుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..