AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇరాన్‌లో అంత‌ర్జాతీయ రెజ్లర్‌కి ఉరిశిక్ష‌..!

కఠిన శిక్షలకు మారుపేరైన సౌదీ దేశాల్లో మరో దారుణం జరిగింది. తాజాగా ఇరాన్‌ ప్రభుత్వం ఓ అంత‌ర్జాతీయ‌ క్రీడాకారుడికి మరణశిక్షను అమలు చేసింది. ప్రభుత్వ వ్యతిరేక నిర‌స‌న‌ ప్రదర్శనలో పాల్గొని ఓ సెక్యూరిటీ గార్డు చావుకు కారణమయ్యాడన్న ఆరోప‌ణ‌ల‌పై మ‌ర‌ణ‌శిక్ష విధించింది.

ఇరాన్‌లో అంత‌ర్జాతీయ రెజ్లర్‌కి ఉరిశిక్ష‌..!
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 13, 2020 | 2:41 PM

కఠిన శిక్షలకు మారుపేరైన సౌదీ దేశాల్లో మరో దారుణం జరిగింది. తాజాగా ఇరాన్‌ ప్రభుత్వం ఓ అంత‌ర్జాతీయ‌ క్రీడాకారుడికి మరణశిక్షను అమలు చేసింది. ప్రభుత్వ వ్యతిరేక నిర‌స‌న‌ ప్రదర్శనలో పాల్గొని ఓ సెక్యూరిటీ గార్డు చావుకు కారణమయ్యాడన్న ఆరోప‌ణ‌ల‌పై మ‌ర‌ణ‌శిక్ష విధించింది. గతంలో విధించిన శిక్షను తాజాగా ఆ దేశ ప్ర‌భుత్వం అమ‌లుచేసింది. ఇరాన్‌కు చెందిన అంత‌ర్జాతీయ స్థాయి రెజ్లర్‌ నవీద్‌ అఫ్కారీ (27)ను ఉరి తీసింది.

2018లో ఇరాన్ దేశవ్యాప్తంగా జరిగిన ఓ ప్రభుత్వ వ్య‌తిరేక ఆందోళనలో నవీద్ అఫ్కారీ కూడా పాల్గొన్నాడు. ఆ ఆందోళ‌న సంద‌ర్భంగా న‌వీద్ ఒక‌ సెక్యూరిటీ గార్డును హత్య చేశాడ‌న్న ఆరోప‌ణ‌ల‌పై కేసు న‌మోదైంది. దీనిపై విచారణ జరిపిన ఇరాన్ అత్యున్నత న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ఈ శిక్షను ఇటీవల అమలు చేసినట్లు ఆ దేశ మీడియా కథనాన్ని వెలువరించింది.

అయితే, ఇరాన్ ప్ర‌భుత్వ నిర్ణయాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. ఆ దేశ ఆరోపణలను అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ పూర్తిగా ఖండించింది. నవీద్‌కు మరణశిక్షను నిలిపివేయాలంటూ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 85 వేల మంది అథ్లెట్లు ఇరాన్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. న‌వీద్‌ను లక్ష్యంగా చేసుకుని అన్యాయంగా బలి చేస్తున్నారంటూ ది వరల్డ్‌ ప్లేయర్స్‌ అసోసియేషన్‌ పేర్కొన్న‌ది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ కూడా నవీద్‌కు క్షమాభిక్ష పెట్టాల‌ని కోరాడు. నవీద్‌పై చర్య విచారకరమని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ పేర్కొంది. అయినా, ఇరాన్ ప్ర‌భుత్వం మాత్రం ఉరిశిక్ష‌ను అమ‌లు చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.

కాగా, మ‌ర‌ణ‌శిక్ష అమ‌లు అనంత‌రం నవీద్‌కు చెందిన ఓ ఆడియో టేపు బయటకు వచ్చింది.. ‘నాకు మరణశిక్ష అమలు చేస్తే మీకో విషయం తెలియ‌జేయాల‌నుకుంటున్నా. స్వశక్తిపై పోరాటం చేయాలనుకుంటున్న వ్యక్తి ప్రాణాలు తీశారు’ అంటూ నవీద్ ఆడియో టేపులో వెల్లడించారు. కాగా, నవీద్‌ను చివరిసారి చూసేందుకు అతని కుటుంబసభ్యులకు కూడా కనీసం అవకాశం కల్పించలేదు.