ఆ మెరుపులు తగ్గవు.. వీవీఎస్ లక్ష్మణ్

సెప్టెంబరు 19న యూఏఈ వేదికగా ఐపీఎల్​ ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఐపీఎల్‌ ఖాళీ స్టేడియాల్లో జరిగినప్పటికీ.. ఆటపై ఆ ప్రభావం ఉండదని వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నారు. కరోనా పరిస్థితుల మధ్య బయో సెక్యూర్​...

  • Sanjay Kasula
  • Publish Date - 12:44 pm, Tue, 25 August 20
ఆ మెరుపులు తగ్గవు.. వీవీఎస్ లక్ష్మణ్

సెప్టెంబరు 19న యూఏఈ వేదికగా ఐపీఎల్​ ప్రారంభం కానుంది. దుబాయ్ కేంద్రంగా జరుగనున్న ఐపీఎల్ మ్యాచులు ఎలా ఉండనున్నాయి..? అప్పటి మెరుపులు ఇందులో ఉండనున్నాయా..? భారీ పురుగులు.. భారీ షాట్స్.. చూడగలమా..? ప్రపచం వ్యాప్తంగా ఉండే ఆటగాళ్లు ఒకే వేదికగా ఆడే ఆట ఐపీఎల్ పై ప్రేక్షకుల్లో ఎన్నో సందేహాలు. అయితే ఇలాంటి ప్రశ్నలకు చెక్ పెట్టారు వీవీఎస్ లక్ష్మణ్.

ఈ ఏడాది ఐపీఎల్‌ ఖాళీ స్టేడియాల్లో జరిగినప్పటికీ.. ఆటపై ఆ ప్రభావం ఉండదని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటింగ్‌ మానీటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నారు. కరోనా పరిస్థితుల మధ్య బయో సెక్యూర్​ వాతావరణంలో లీగ్​​ నిర్వహించనున్న నేపథ్యంలో లక్ష్మణ్​​ తన అభిప్రాయాలు వెల్లడించారు.

మ్యాచ్‌ల తాలూకు ఉత్సాహం, ఆటలో నాణ్యత ఎంతమాత్రం తగ్గవన్నారు. అయితే యూఏఈలో పిచ్‌లు మాత్రం కొంచెం నెమ్మదిగా ఉండే అవకాశముందన్నారు. కానీ మైదాన సిబ్బంది మనల్ని ఆశ్చర్యపరిచేలా ఏమైనా చేస్తారేమో చూడాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడి స్టేడియాల్లో ఔట్‌ ఫీల్డ్‌ మాత్రం అద్భుతంగా ఉంటుందన్నారు. మైదానంలో ఎక్కడా జనం లేకపోయినా, స్టాండ్స్‌ ఖాళీగా ఉన్నా అభిమానులు ఐపీఎల్​ మ్యాచ్‌లను కచ్చితంగా ఆస్వాదిస్తారని భరోసా ఇచ్చారు..వీవీఎస్​ లక్ష్మణ్​. ​

ప్రియమ్‌ గార్గ్‌, విరాట్‌ సింగ్‌, బి.సందీప్‌ లాంటి కుర్రాళ్లను గత వేలంలో ఎంచుకోవడంపై వీవీఎస్‌ వివరణ ఇచ్చారు. ఒక ప్రణాళిక ప్రకారమే వేలంలో యువ క్రికెటర్లను తీసుకున్నామన్నారు. ఈ కుర్రాళ్లు దేశవాళీల్లో చక్కగా ఆడుతున్నారని తెలిపారు. దేశీయ, విదేశీ ఆటగాళ్లలో అనుభవజ్ఞులు చాలా మంది మాకు అందుబాటులో వివరించారు.