AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Schedule: ఐపీఎల్ 2026 ఛాంపియన్‌గా ముంబై ఇండియన్స్.. షెడ్యూల్‌తో బయటపడ్డ నిజం..?

IPL Schedule Facts: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 టోర్నమెంట్ షెడ్యూల్‌ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈసారి ఎన్నికల కారణంగా మొదటగా 20 మ్యాచ్‌ల షెడ్యూల్ మాత్రమే విడుదల చేశారు. మార్చి 28న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

IPL Schedule: ఐపీఎల్ 2026 ఛాంపియన్‌గా ముంబై ఇండియన్స్.. షెడ్యూల్‌తో బయటపడ్డ నిజం..?
Mumbai Indians
Venkata Chari
|

Updated on: Mar 12, 2026 | 10:11 AM

Share

Mumbai Indians IPL Champion Prediction: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఐపీఎల్ 2026 షెడ్యూల్‌ను ప్రకటించింది. నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రారంభంగా 20 మ్యాచ్‌ల షెడ్యూల్ మాత్రమే వెల్లడించారు. ఈ టోర్నమెంట్ తొలి మ్యాచ్ మార్చి 28న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో తలపడనుంది.

ముంబై ఇండియన్స్ ఛాంపియన్ అవుతుందా..?

ఐపీఎల్ 2026 షెడ్యూల్‌లో ఒక ఆసక్తికర యాదృచ్ఛికం కనిపిస్తోంది. 2017లో కూడా ఐపీఎల్ తొలి మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్యే జరిగింది. ఆ సీజన్‌లో చివరకు ముంబై ఇండియన్స్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు 2026లో కూడా అదే రెండు జట్లు తొలి మ్యాచ్ ఆడబోతుండటంతో ముంబై ఇండియన్స్ మరోసారి టైటిల్ గెలుస్తుందా అనే చర్చ క్రికెట్ వర్గాల్లో మొదలైంది.

ఎక్కువమంది చదివినది: Team India: వీళ్లే ఇంత డేంజరస్‌గా ఉంటే.. ఇక టీమిండియాలోకి వాడు ఎంట్రీ ఇస్తే.. మిగతా జట్లన్నీ వాకౌటే..!

ఇవి కూడా చదవండి

18 సంవత్సరాల తర్వాత బెంగళూరులో ఓపెనింగ్ మ్యాచ్..

ఐపీఎల్ చరిత్రలో మరో ప్రత్యేక విషయం ఏమిటంటే 18 సంవత్సరాల తర్వాత బెంగళూరులో తొలి మ్యాచ్ జరగడం. 2008లో ఐపీఎల్ మొదటి సీజన్ ప్రారంభమైనప్పుడు కూడా తొలి మ్యాచ్ ఎం. చిన్నస్వామి స్టేడియంలోనే జరిగింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ అదే మైదానం ఓపెనింగ్ మ్యాచ్‌కు వేదిక కావడం విశేషం.

ఆర్సీబీకి ఏడోసారి అవకాశం..

ఈసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఏడోసారి ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్ ఆడబోతోంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా తొమ్మిది సార్లు తొలి మ్యాచ్ ఆడిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ అగ్రస్థానంలో ఉంది.

సీఎస్కే – ముంబై లేకుండా ఓపెనింగ్ మ్యాచ్..

ఐపీఎల్ చరిత్రలో తొలిసారి వరుసగా రెండు సీజన్లలో ముంబై ఇండియన్స్ లేదా చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్‌లో పాల్గొనడం లేదు. 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఇప్పుడు 2026లో ఆర్సీబీ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది.

ఎక్కువమంది చదివినది: Expensive Players: ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన ఆటగాళ్లు.. లిస్ట్‌లో మనోళ్లు ఐదుగురు.. ఆ పేరు షాకింగ్ భయ్యో..!

ఈ మూడు జట్లకు ఇంకా అవకాశం రాలే..

ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు మూడు జట్లు మాత్రమే సీజన్ తొలి మ్యాచ్ ఆడే అవకాశం పొందలేదు. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఇప్పటివరకు ఓపెనింగ్ మ్యాచ్ ఆడలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us