IPL 2026 Playoff: నిన్న తొడగొట్టారు.. నేడు తడబడ్డారు.. ప్లేఆఫ్ రేసు నుంచి పంజాబ్, బెంగళూరు ఔట్..?
IPL 2026 Playoff: ఇండియన్ ప్రిమియర్ లీగ్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాల్లో కొనసాగుతున్న పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్లేఆఫ్ కష్టాలు మొదలయ్యాయి. వరుస ఓటములతో సతమతమవుతున్న ఈ జట్లు సెమీఫైనల్ చేరాలంటే రాబోయే మ్యాచ్‌ల్లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమీకరణాలను పరిశీలిస్తే ప్లేఆఫ్ పోరు ఎంత కఠినమో అర్థమవుతుంది.

IPL 2026 Playoff: ఐపీఎల్ టోర్నీ ఇప్పుడు నిర్ణయాత్మక దశకు చేరుకుంది. ఒక్కో విజయం ప్లేఆఫ్ అవకాశాలను మెరుగుపరుస్తుంటే, ఒక్క ఓటమి మొత్తం పట్టికను తలకిందులు చేస్తోంది. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నప్పటికీ, వారి ప్లేఆఫ్ బెర్త్ ఇంకా ఖరారు కాలేదు. పంజాబ్ జట్టు తన గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడగా, బెంగళూరు జట్టు కూడా గుజరాత్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఇరు జట్లపై ఒత్తిడి పెరిగింది.
పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్ మార్గం..
శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడింది. వరుసగా ఆరు విజయాలతో దూసుకుపోయిన ఈ జట్టు, గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ప్రస్తుతం 13 పాయింట్లతో ఉన్న పంజాబ్, ప్లేఆఫ్ చేరాలంటే మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో కనీసం రెండింటిలో విజయం సాధించాలి. అయితే వరుస ఓటములు జట్టులో ఆందోళన కలిగిస్తున్నాయి. మరో ఓటమి ఎదురైతే ప్లేఆఫ్ ఆశలు గాలిలో దీపంలా మారే అవకాశం ఉంది.
పంజాబ్ కింగ్స్ మిగిలిన మ్యాచ్‌లు:
మే 6: సన్‌రైజర్స్ హైదరాబాద్ (హైదరాబాద్)
మే 11: ఢిల్లీ క్యాపిటల్స్ (ధర్మశాల)
మే 14: ముంబై ఇండియన్స్ (ధర్మశాల)
మే 17: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ధర్మశాల)
మే 23: లక్నో సూపర్ జెయింట్స్ (లక్నో)
బెంగళూరు జట్టుకు తప్పని పరీక్ష..
రజత్ పాటిదార్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా పంజాబ్ తరహాలోనే 9 మ్యాచ్‌లు ఆడి 12 పాయింట్లు సాధించింది. 6 విజయాలు, 3 ఓటములతో ఉన్న ఈ జట్టుకు కూడా మరో రెండు విజయాలు అవసరం. గత మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఎదురైన భారీ ఓటమి నెట్ రన్ రేట్‌పై ప్రభావం చూపింది. లక్నోతో జరగనున్న తదుపరి మ్యాచ్ బెంగళూరుకు కీలకంగా మారింది. ఇందులో ఓడితే ప్లేఆఫ్ రేసులో వెనుకబడే ప్రమాదం ఉంది.
IPL 2026: L,L,L.. హ్యాట్రిక్‌తో దిమ్మతిరిగే షాక్.. ప్లేఆఫ్స్ చేరకుండానే పంజాబ్ కింగ్స్ ఔట్..?
బెంగళూరు మిగిలిన మ్యాచ్‌లు:
మే 7: లక్నో సూపర్ జెయింట్స్ (లక్నో)
మే 10: ముంబై ఇండియన్స్ (రాయ్‌పూర్)
మే 13: కోల్‌కతా నైట్ రైడర్స్ (రాయ్‌పూర్)
మే 17: పంజాబ్ కింగ్స్ (ధర్మశాల)
మే 22: సన్‌రైజర్స్ హైదరాబాద్ (హైదరాబాద్)
కీలకమైన మే 17 పోరు..
ఈ సీజన్‌లో పంజాబ్, బెంగళూరు జట్లు ఇప్పటివరకు తలపడలేదు. మే 17న ధర్మశాల వేదికగా జరిగే వీరిద్దరి మధ్య పోరు ప్లేఆఫ్ బెర్త్‌ను నిర్ణయించే అవకాశం ఉంది. అప్పటివరకు ఈ రెండు జట్లు ఎన్ని విజయాలు సాధిస్తాయనే దానిపైనే ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
