ఆ క్యాచ్ మిస్ కాకుంటే.. కథ వేరేలా ఉండేదిః కోహ్లీ
మరో ఐపీఎల్ సీజన్ ముగిసింది.. ఇంకో చెత్త ప్రదర్శనతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఘోర పరాజయాన్ని
IPL 2020: మరో ఐపీఎల్ సీజన్ ముగిసింది.. ఇంకో చెత్త ప్రదర్శనతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఘోర పరాజయాన్ని ఎదుర్కుంది. బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమైన బెంగళూరు చేజేతులా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది.
Also Read: పాకిస్థాన్‌లో హిందువులపై మూక దాడి.. రక్షించిన ముస్లింలు..
ఇక మ్యాచ్ అనంతరం ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. తాము బ్యాటింగ్‌లో తగినన్ని పరుగులు చేయలేదని అన్నాడు. అలాగే సైనీ బౌలింగ్‌లో కేన్ విలియమ్సన్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద పడిక్కల్ పట్టడంలో విఫలమయ్యాడని.. ఒకవేళ ఆ క్యాచ్‌ను మిస్ చేసి ఉండకపోతే ఫలితం వేరేలా ఉండేదని కోహ్లీ తెలిపాడు. ఈ సీజన్‌లో జట్టు తరపున పడిక్కల్, సిరాజ్ మంచి ప్రదర్శన కనబరిచారు.
Also Read: దీపావళి బంపర్ ఆఫర్.. 101 రూపాయలకే స్మార్ట్ ఫోన్..!