వారిదే ఐపీఎల్ టైటిల్.. ఆర్చర్ జోస్యం..

ఐపీఎల్ 2020 చివరి దశకు చేరుకుంది. ఇప్పటిదాకా లీగ్‌లో 47 మ్యాచ్‌లు అయినప్పటికీ ఇంకా టాప్ 4 జట్లపై క్లారిటీ రాలేదు. దీనితో ఆఖరి మ్యాచ్‌లు

వారిదే ఐపీఎల్ టైటిల్.. ఆర్చర్ జోస్యం..
Ravi Kiran

|

Oct 28, 2020 | 4:01 PM

IPL 2020: ఐపీఎల్ 2020 చివరి దశకు చేరుకుంది. ఇప్పటిదాకా లీగ్‌లో 47 మ్యాచ్‌లు అయినప్పటికీ ఇంకా టాప్ 4 జట్లపై క్లారిటీ రాలేదు. దీనితో ఆఖరి మ్యాచ్‌లు రసవత్తరంగా సాగనున్నాయి. ఈ తరుణంలో రాజస్థాన్ రాయల్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్ చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సీజన్ టైటిల్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గెలుస్తుందని ఆ ట్వీట్ సారాంశం. అయితే అది ఇప్పటిది కాదు.. ఆరేళ్ల క్రితం చేసిన ట్వీట్. 2014లో ఆర్చర్ చేసిన ఆ ట్వీట్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇటీవల రీ-ట్వీట్ చేసింది.

ఇక ఈ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇప్పటిదాకా ఆడిన 12 మ్యాచ్‌ల్లో.. ఆరు గెలుపొందింది. అందులో ఐదు విజయాలు వరుసగా వచ్చినవే. లీగ్ సెకండాఫ్‌లో పంజాబ్ దుమ్ములేపుతోంది. వరుస విజయాలతో తన జైత్రయాత్రను కొనసాగిస్తూ ప్లేఆఫ్ రేసులోకి వచ్చేసింది. దీనితో ఈసారి పంజాబ్‌దే టైటిల్ అని చాలామంది అంటున్నారు.

2014 ఫైనల్‌లో కేకేఆర్ చేతుల్లో చతికిలబడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. ఈసారి ఖచ్చితంగా టైటిల్ గెలుస్తుందని కొంతమంది అభిప్రాయపడుతుంటే.. వారికి అంత సీన్ లేదని మరికొందరు ఆ వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు. ప్రధానంగా సెకండాఫ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫామ్ అద్భుతంగా ఉంది. ఈ సమయంలో ఆర్చర్ ఓల్డ్ ట్వీట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం.. దాన్ని పంజాబ్ రీ-ట్వీట్ చేయడం ఇప్పుడిదే హాట్ టాపిక్. మరి ఆర్చర్ జోస్యం నిజం అవుతుందా.? లేదా.? అనేది తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాలి.

Also Read:

ముంబై ఇండియన్స్‌కు షాక్.. టోర్నీ వీడనున్న హిట్‌మ్యాన్.!

మధ్యాహ్న భోజన పధకంలో మార్పులు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకు కొలువుల జాతర..

భక్తులకు శుభవార్త.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల..

రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్ బులిటెన్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu