రసకందాయంలో ఐపీఎల్‌ టోర్నమెంట్‌!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తున్నది.. గెలుస్తాయనుకున్న జట్లేమో ఓడిపోతున్నాయి.. పరాజయం తప్పదనుకున్న టీమ్‌లేమో విజయం సాధిస్తున్నాయి.. ప్లే ఆఫ్స్‌ ఖాయంగా వెళతాయనుకున్న జట్లు డీలాపడ్డాయి.. పాయింట్ల పట్టికలో ఎక్కడో ఉన్న టీమ్‌లు ముందుకొచ్చేశాయి.. ఇప్పటికీ నాకౌట్‌కు చేరుకున్న టీమ్‌లేమిటో తెలియదంటే ఐపీఎల్‌ టోర్నీ ఎంత రసవత్తరంగా సాగుతున్నదో అర్థమవుతుంది.. నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ గెలుపొందడంతో నాకౌట్‌కు చేరే నాలుగో టీమ్‌పై ఉత్కంఠత పెరిగింది.. ఇవాళ సాయంత్రం ముంబాయి ఇండియన్స్‌తో రాయల్‌ […]

రసకందాయంలో ఐపీఎల్‌ టోర్నమెంట్‌!
Follow us

|

Updated on: Oct 28, 2020 | 3:48 PM

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తున్నది.. గెలుస్తాయనుకున్న జట్లేమో ఓడిపోతున్నాయి.. పరాజయం తప్పదనుకున్న టీమ్‌లేమో విజయం సాధిస్తున్నాయి.. ప్లే ఆఫ్స్‌ ఖాయంగా వెళతాయనుకున్న జట్లు డీలాపడ్డాయి.. పాయింట్ల పట్టికలో ఎక్కడో ఉన్న టీమ్‌లు ముందుకొచ్చేశాయి.. ఇప్పటికీ నాకౌట్‌కు చేరుకున్న టీమ్‌లేమిటో తెలియదంటే ఐపీఎల్‌ టోర్నీ ఎంత రసవత్తరంగా సాగుతున్నదో అర్థమవుతుంది.. నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ గెలుపొందడంతో నాకౌట్‌కు చేరే నాలుగో టీమ్‌పై ఉత్కంఠత పెరిగింది.. ఇవాళ సాయంత్రం ముంబాయి ఇండియన్స్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు పోటీపడుతుంది.. రెండు జట్లు 14 పాయింట్లతో సమంగా ఉన్నాయి..ఇవాళ జరిగే మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా అది 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌ చేరుకున్న తొలి టీమ్‌గా నిలుస్తుంది.. ఒకవేళ ఈ మ్యాచ్‌లో బెంగళూరు గెలిస్తే బెంగేలేదు.. తర్వాత జరిగే హైదరాబాద్‌, ఢిల్లీ మ్యాచ్‌లలో ఓడినా బెంగళూరుకు వచ్చే నష్టమేమీ ఉండదు.. అయితే ముంబాయి గెలిస్తేనే ప్రాబ్లం.. అప్పుడు బెంగళూరు మిగతా రెండు మ్యాచ్‌లలో కంపల్సరీగా గెలవాల్సి ఉంటుంది.. అలాగని ముంబాయి టీమ్‌ పరిస్థితి గొప్పగా ఏమీ లేదు..ఈ మ్యాచ్‌లో ఓడిపోతే హైదరాబాద్‌, ఢిల్లీలతో జరిగే మ్యాచ్‌లలో ఒకదాంట్లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో టాప్‌ ప్లేస్‌లో ఉండాలంటే మాత్రం రెండు మ్యాచ్‌లలో గెలవాలి.. ఇక ఢిల్లీ కేపిటల్స్‌ విషయానికి వస్తే 14 పాయింట్లతో టాప్‌ ప్లేస్‌లో ఉన్నప్పటికీ ఆ జట్టు గత మూడు మ్యాచ్‌లలో ఓటమి పాలవ్వడంతో పరిస్థితి కాసింత గందరగోళంలో పడింది.. నెట్‌ రన్‌రేట్‌ కూడా పడిపోయింది.. దాంతో ఇప్పుడు మూడోస్థానానికి చేరుకుంది.. ఇప్పుడా జట్టు ముంబాయి, బెంగళూరులతో ఆడాల్సి వుంది.. ఈ రెండు మ్యాచ్‌లలో గెలిస్తే 18 పాయింట్లతో సెకండ్‌ ప్లేస్‌లో ఉంటుంది.. ఏదో ఒక మ్యాచ్‌లో గెలిస్తే మాత్రం మూడో ప్లేస్‌లో నిలుస్తుంది. రెండింటిలో ఓడిపోయినా పర్వాలేదు .. నెట్‌రన్‌రేటుతో నెట్టుకురావచ్చు. పంజాబ్‌, కోల్‌కతాలు కూడా ప్లే ఆఫ్స్‌ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి.. ఈ రెండు జట్లు తర్వాతి మ్యాచ్‌లలో రాజస్తాన్‌, చెన్నై టీమ్‌లతో ఆడాల్సి ఉంది.. పంజాబ్‌ విజయాలతో ఊపు మీద ఉంది.. తర్వాతి రెండు మ్యాచ్‌లలో ఈజీగా గెలిచే ఛాన్సుంది.. మరోవైపు కోల్‌కతా రెండింటిలోనూ గెలవాల్సిన పరిస్థితి వచ్చింది.. అలా గెలిచినా నెట్‌ రన్‌రేట్‌ కీలకంగా మారే అవకాశం ఉంది.. ముంబాయి, ఢిల్లీ, బెంగళూరు టీమ్‌లలో ఏ ఒక్కటైనా అన్ని మ్యాచ్‌లు ఓడిపోతే అప్పుడుంటుంది మజా! అప్పుడు పంజాబ్‌, కోల్‌కతాలు ప్లేఆఫ్స్‌ చేరుకుంటాయి.. మరి మన హైదరాబాద్‌ సంగతేమిటన్న అనుమానం రావచ్చు.. హైదరాబాద్‌తో పాటు రాజస్తాన్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలు మిగతా జట్ల గెలుపోటములపై ఆధారపడి ఉన్నాయి.. చెరో పది పాయింట్లతో ఆరేడు స్థానాలలో ఉన్న ఈ రెండు జట్లు తర్వాత జరగబోయే అన్ని మ్యాచ్‌లలోనూ తప్పనిసరిగా గెలవాలి.. గెలవడమే కాదు.. అటు పంజాబ్‌, కోల్‌కతాలు ఓడిపోవాలి.. ఇప్పుడు హైదరాబాద్‌కు రెండు మ్యాచ్‌లున్నాయి.. ఒకటి ముంబాయితో, రెండోది బెంగళూరుతో.. ఈ రెండు మ్యాచ్‌లలో విజయం సాధించాలంటే హైదరాబాద్‌ చెమటోడ్చాల్సి ఉంటుంది.. గెలవాలనే మనం కోరుకుందాం.. రాజస్తానేమో పంజాబ్‌, కోల్‌కతాలతో ఆడాల్సి ఉంది.. ఈ రెండు జట్లపై విజయం సాధించడం రాజస్తాన్‌కు కష్టమే.. చూద్దాం ఏమవుతుందో…!

చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..