చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు మెయిన్ ప్లేయర్ అంబటి రాయుడు మరో రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం. ముంబైతో ఆరంభ మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో అదరగొట్టిన రాయుడు.. ఆ తర్వాత జరిగిన రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో ఆడలేదు. తొడ కండరాలు పట్టేయడంతో రాయుడు స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ను సీఎస్కే తుది జట్టులోకి తీసుకుంది. (RCB Vs KXIP Live Score Update)
రాయుడికి కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని ఫిజియోలు స్పష్టం చేయడంతో.. మరో రెండు మ్యాచ్‌లకు కూడా అతడు ఆడే అవకాశం కనిపించట్లేదు. అలాగే చెన్నై జట్టు ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో కూడా గాయం కారణంగా మొదటి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. మరి రేపు ఢిల్లీతో జరగబోయే పోరుకు అందుబాటులో ఉంటాడో లేదో వేచి చూడాలి. (IPL 2020)
Also Read:
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. స్కూల్‌కు వెళ్లకుండానే పది పరీక్షలు.?
శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..