రోజు రోజుకి విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఫరీక్షల్లో ఫెయిల్ కావడం.. తల్లిదండ్రులు తిట్టడం.. ప్రేమ తగాదాలు ఇలా కారణం ఏదైనా చావే మార్గం అనుకుంటున్నారు. తాజాగా గుంటూరు జిల్లా విజ్ఞాన్ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని శశి ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ గదిలో ఉండే ఓ విద్యార్థిని బ్యాగ్‌లో డబ్బులు పోయాయని కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. తోటి విద్యార్థినులు ఆమెపై అనుమానం వ్యక్తం చేయడంతో శశి తీవ్ర మనస్థాపానికి గురైంది. అనుమానం భరించలేక ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి స్వగ్రామం యడ్లపాడు మండలం గుత్తావారిపాలెంగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.