గుడ్ న్యూస్: మారటోరియం వేళ వసూలు చేసిన చక్రవడ్డీ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తోన్న బ్యాంకులు

బ్యాంకు రుణ గ్రహీతలకు శుభవార్త: మారటోరియం సమయంలో రుణగ్రహీతల ఖాతాల నుంచి వసూలు చేసిన చక్రవడ్డీ మొత్తాన్ని తిరిగి తమ ఖాతాదారులకు చెల్లించడం మొదలుపెట్టాయి బ్యాంకులు. శుక్రవారం నుంచి చాలా మంది ఖాతాదారులకు ఎక్స్ గ్రేషియా రూపంలో వారి వారి అకౌంట్లలోకి ఈ మొత్తం వచ్చి చేరింది కూడా. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీలు)తో పాటు అన్ని రుణ సంస్థలూ మారటోరియం సమయంలో వసూలు చేసిన అదనపు మొత్తాన్ని నవంబర్ 5తేదీ లోపు రుణగ్రహీతలకు తిరిగి […]

  • Venkata Narayana
  • Publish Date - 6:08 pm, Fri, 6 November 20
గుడ్ న్యూస్: మారటోరియం వేళ వసూలు చేసిన చక్రవడ్డీ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తోన్న బ్యాంకులు

బ్యాంకు రుణ గ్రహీతలకు శుభవార్త: మారటోరియం సమయంలో రుణగ్రహీతల ఖాతాల నుంచి వసూలు చేసిన చక్రవడ్డీ మొత్తాన్ని తిరిగి తమ ఖాతాదారులకు చెల్లించడం మొదలుపెట్టాయి బ్యాంకులు. శుక్రవారం నుంచి చాలా మంది ఖాతాదారులకు ఎక్స్ గ్రేషియా రూపంలో వారి వారి అకౌంట్లలోకి ఈ మొత్తం వచ్చి చేరింది కూడా. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీలు)తో పాటు అన్ని రుణ సంస్థలూ మారటోరియం సమయంలో వసూలు చేసిన అదనపు మొత్తాన్ని నవంబర్ 5తేదీ లోపు రుణగ్రహీతలకు తిరిగి చెల్లించాల్సిందిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఆదేశించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర సర్కారు ఎక్స్‌గ్రేషియా చెల్లింపు రూపంలో ఈ మొత్తాన్ని జమచేయనున్నట్లు ప్రకటించింది. గృహ, విద్య, క్రెడిట్‌ కార్డు, వాహన, ఎంఎస్‌ఎంఈ, ఎలక్ట్రానిక్స్‌, రుణాలు పొందిన రుణగ్రస్తులకు ఈ పథకం వర్తిస్తుంది. అంతేకాదు బ్యాంకు ల్లో బంగారు ఆభరణాలపై పొందిన రుణాలకు కూడా ఇది వర్తిస్తుందని ఆర్థిక శాఖ తెలిపింది. 2020 మార్చి 1 నుంచి ఆరు నెలల మారటోరియం సమయానికి రూ .2 కోట్ల వరకు రుణాల వడ్డీపై వడ్డీని మాఫీ చేయాలని బ్యాంకుయేతర ఆర్థిక సంస్థలతో సహా అన్ని రుణ సంస్థలను గత వారం రిజర్వ్ బ్యాంక్ కోరిన విషయం విదితమే.