న్యూస్ టెలివిజన్ అవార్డ్సులో టీవీ9 ప్రభంజనం

న్యూస్ టెలివిన్ అవార్డ్సులో టీవీ9 ప్రభంజనం సృష్టించింది. వివిధ విభాగాల్లో 17 NT అవార్డులు సొంతం చేసుకుని.. కొత్త రికార్డు నమోదు చేసింది.

  • Balaraju Goud
  • Publish Date - 6:07 pm, Fri, 6 November 20
న్యూస్ టెలివిజన్ అవార్డ్సులో టీవీ9 ప్రభంజనం

NEWS TELEVISION AWARDS: న్యూస్ టెలివిన్ అవార్డ్సులో టీవీ9 ప్రభంజనం సృష్టించింది. వివిధ విభాగాల్లో 17 NT అవార్డులు సొంతం చేసుకుని.. కొత్త రికార్డు నమోదు చేసింది. బెస్ట్‌ న్యూస్‌ డిబేట్‌ షో అవార్డును.. బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌ సొంతం చేసుకుంది. బెస్ట్‌ ప్రైమ్‌టీవీ న్యూస్‌ యాంకర్‌ అవార్డును మురళీకృష్ణ గెలుచుకున్నారు. బెస్ట్‌ టీవీ న్యూస్‌ ప్రెజెంటర్‌ అవార్డు పూర్ణిమకు లభించింది. బెస్ట్‌ డైలీ న్యూస్‌ బులిటెన్‌ అవార్డు Top News 9 సొంతం చేసుకుంది. అలాగే బెస్ట్‌ టీవీ న్యూస్‌ రిపోర్టర్‌గా అశోక్‌ వేములపల్లి‌, బెస్ట్‌ యంగ్‌ టీవీ జర్నలిస్ట్‌గా స్వప్నిక నిలిచారు.

బెస్ట్‌ ప్రైమ్‌ టైమ్‌ న్యూస్‌ షో అవార్డును “అనగనగా ఒక ఊరు” సొంతం చేసుకుంది. బెస్ట్‌ వీడియో ఎడిటర్‌ అవార్డు అనగనగా ఒక ఊరు కార్యక్రమానికిగాను బి.మోహన్‌కు లభించింది. “బెస్ట్‌ ప్రోమో ఫర్‌ ఏ షో” అవార్డు కూడా అనగనగా ఒక ఊరును వరించింది. “బెస్ట్‌ ప్రోమో క్యాంపైన్‌ బై ఏ న్యూస్‌ ఛానల్‌ అవార్డు”.. టీవీ9 ప్రసారం చేసిన “బ్యాన్‌ ప్లాస్టిక్‌ క్యాంపైన్‌”కు లభించింది.

ఎన్టీ అవార్డుల్లో టీవీ9 గ్రాఫిక్స్‌ టీమ్‌ సత్తా చాటింది. బెస్ట్‌ యూజ్‌ ఆఫ్‌ గ్రాఫిక్స్‌ అవార్డు “బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌”ను వరించింది. బెస్ట్‌ ప్రోమో ఫర్‌ ఏ ఛానల్‌, బెస్ట్‌ ఛానల్‌ ప్యాకేజింగ్‌ అవార్డులను టీవీ9 సొంతం చేసుకుంది. బెస్ట్‌ సెట్‌ డిజైన్‌ అవార్డు 30 మినిట్స్‌ కార్యక్రమానికి, బెస్ట్‌ షో ప్యాకేజింగ్‌ అవార్డు “ఎంటర్‌టైన్మెంట్‌ టు నైట్‌”కు లభించాయి. అలాగే టీవీ రంగంలో బెస్ట్‌ టెక్నాలాజికల్‌ ఇన్నోవేషన్‌ అవార్డు కూడా టీవీ9 సొంతం చేసుకుంది. అలాగే బెస్ట్‌ న్యూస్‌ చానల్‌ వెబ్‌సైట్‌ అవార్డు tv9telugu.com ను వరించింది.