ట్రబుల్ ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్.. ఒక్క సారిగా డౌన్ అయింది.. ఎందుకు ఇలా జరిగిందంటే..

ఏంటో ఈ మధ్య సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్, సెర్చ్ ఇంజన్స్ అప్పుడప్పుడు ట్రబుల్ ఇస్తున్నాయి. ఇటీవల గూగుల్,

ట్రబుల్ ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్.. ఒక్క సారిగా డౌన్ అయింది.. ఎందుకు ఇలా జరిగిందంటే..

Updated on: Dec 19, 2020 | 6:12 AM

ఏంటో ఈ మధ్య సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్, సెర్చ్ ఇంజన్స్ అప్పుడప్పుడు ట్రబుల్ ఇస్తున్నాయి. ఇటీవల గూగుల్, యూట్యూబ్‌లు ఒక్కసారిగా ఆగిపోయాయి. కొద్దిసేపటికి మళ్లీ రన్ అయ్యాయి. కానీ ఆ కొద్దిసేపటికే యూజర్లు ఆగమాగం అయ్యారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచ వ్యాప్తంగా షాక్ ఇచ్చింది. శుక్రవారం రాత్రి ప్రముఖ సోషల్ మీడియా క్రాష్ అయిందని ట్విట్టర్‌లో #InstagramCrashing హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ అయింది. కాసేపటి వరకూ పనిచేయకుండా పోయిన ఇన్ స్టా కొద్ది సేపటికి సెట్ అయింది. ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయిన కాసేపటికే ఇంటర్నెట్‌లో యూజర్లు మేమ్స్, రియాక్షన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ట్రోల్ చేశారు. యూజర్లు పెరిగిపోవడంతోనే ఇలా జరిగినట్లుగా చెబుతున్నారు. సాల్వ్ అయిపోయిందని చెప్తున్నా.. ఇంకా చాలా మంది యూజర్లు తమ ఫోన్లలో INSTAGRAM యాప్ సరిగా పనిచేయడం లేదని కంప్లైంట్ చేస్తున్నారు.