ఉత్తర్‌ప్రదేశ్లోని అలీగఢ్‌లో ఓ చిన్నారి చేతులు విరిచి.. కనుగుడ్లు పెరికి దారుణాతి దారుణంగా హత్య చేసిన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై జాతీయ భద్రతా చట్టం(ఎన్‌ఎస్‌ఏ) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే తాము ఫిర్యాదు చేసినా.. పోలీసులు సరిగా స్పందించకపోవడం వల్లే తమ కూతురి ప్రాణాలు పోయాయని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీసు విభాగం ఒక ఇన్‌స్పెక్టర్, ముగ్గురు సబ్ ఇన్‌స్పెక్టర్లతో పాటు ఓ కానిస్టేబుల్‌ని సస్పెండ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు జాహిద్, అస్లాం అని వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ అమానవీయ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అనేక మంది రాజకీయ నాయకులు, ప్రముఖులు దీన్ని ఖండించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ.. చిన్నారి హత్య తనని తీవ్రంగా కలచివేసిందన్నారు. ‘‘ఉత్తర్‌ప్రదేశ్ అలీగఢ్‌లో జరిగిన చిన్నారి భయంకరమైన హత్య నన్ను తీవ్రంగా కలచివేసింది. ఎవరైనా ఓ చిన్నారి పట్ల ఇంత కిరాతకంగా ఎలా వ్యవహరిస్తారు? ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించకుండా వదిలిపెట్టొద్దు. దోషుల్ని వీలైనంత త్వరగా చట్టం ముందు నిలబెట్టాలి’’ అని రాహుల్‌గాంధీ ట్విటర్ వేదికగా తన విచారాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ సైతం ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ‘‘అలీగఢ్‌లో జరిగిన అమాయక చిన్నారి హత్య ఒక అమానవీయ చర్య. ఈ సందర్భంగా ఆ చిన్నారి తల్లిదండ్రులు అనుభవిస్తున్న ఆవేదనను నేను ఊహించలేను’’ అని ట్వీట్ చేశారు.
The brutal murder in Aligarh is yet another inhuman, unspeakable crime against an innocent child. I cannot even begin to imagine the pain her parents must feel. What has become of us?
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 7, 2019
The horrific murder of a little girl in Aligarh, UP has shocked and disturbed me. How can any human being treat a child with such brutality? This terrible crime must not go unpunished. The UP police must act swiftly to bring the killers to justice.
— Rahul Gandhi (@RahulGandhi) June 7, 2019