#COVID19 కరీంనగర్‌లో కరోనా రోగులు.. ఎక్కడెక్కడ తిరిగారంటే..

|

Mar 19, 2020 | 4:16 PM

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఇండోనేషియన్ కరోనా పాజిటివ్ మనుషుల కదలికల వ్యవహారంలో కీలకమైన సీసీ ఫుటేజ్ లభ్యమైంది. ఇండోనేషియా నుంచి ఢిల్లీ మీదుగా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన.. ఇండోనేషియన్ వ్యక్తులు...

#COVID19 కరీంనగర్‌లో కరోనా రోగులు.. ఎక్కడెక్కడ తిరిగారంటే..
Follow us on

Corona positive persons movement in Karimnagar: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఇండోనేషియన్ కరోనా పాజిటివ్ మనుషుల కదలికల వ్యవహారంలో కీలకమైన సీసీ ఫుటేజ్ లభ్యమైంది. ఇండోనేషియా నుంచి ఢిల్లీ మీదుగా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన.. ఇండోనేషియన్ వ్యక్తులు… కరీంనగర్‌లో 48 గంటల పాటు సంచరించారు. అనుమానం కలుగ కుండా వీరు తిరుగుతున్న దృశ్యాలను కరీంనగర్ పోలీసులు సేకరించారు.

వీరంతా మత సంబంధమైన పనులపై కరీంనగర్‌కు వచ్చినట్లు భావిస్తున్నారు. ఎటు వెళ్ళినా మొత్తం ఏడుగురు వ్యక్తులు కలిసే వెళ్ళడం వీరి ప్రవర్తనపై అనుమానాలకు తావిస్తోంది. చివరికి కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో కరీంనగర్‌లోనే ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. శాంపిల్స్‌ని హైదరాబాద్‌కు పంపించారు. అక్కడి ల్యాబ్స్ కరోనా పాజిటివ్‌గా తేల్చడంతో తెలంగాణలో ఒకే రోజున ఎనిమిది కేసులు రికార్డయ్యాయి. ఈ ఎనిమిదింటిలో ఏడు ఇండోనేషియా నుంచి వచ్చిన ఈ బృందం సభ్యులవే కావడం ప్రమాదకర పరిస్థితిని సూచిస్తోంది.

మార్చి 14న తబ్లిక్ జమాత్ కోసం వచ్చి బొమ్మకల్, గుంటూరు పల్లి మసీదులో 16వ తేదీ వరకు బస చేసి, వెళ్లినట్టు సమాచారం. వారు మసీదులో బస చేసిన సమయంలో వారితో చాలా మంది గ్రామస్తులు కలిసినట్లు తెలుస్తోంది. దీనిపై లోతుగా విచారణ చేపట్టిన ఆ గ్రామాలలో వాకబు చేస్తున్నట్లు సమాచారం. వీరితో కలిసిన, మాట్లాడిన వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు చెబుతున్నారు.

ఇలా తమకు వైరస్ సోకిందని తెలిసో.. తెలియకనో విచ్చలవిడిగా తిరుగుతూ జనమందరికీ వైరస్‌ను అంటిస్తున్న వారెంత మంది వున్నారో అన్న భయాందోళన కలుగుతోంది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అత్యవసరమైతే తప్ప ఇళ్ళ నుంచి బయటికి రావద్దని చెబుతున్నారు. ఎవరైనా విదేశాలకు వెళ్ళి వచ్చిన సమాచారం తెలిస్తే.. వెంటనే దగ్గరలోని పోలీసులకుగానీ.. వైద్య వర్గాలకు గానీ సమాచారం అందించాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి.