కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి నెలలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అన్నింటికంటే ముందు అంతర్జాతీయ విమాన ప్రయాణాలు రద్దయ్యాయి. ఈ క్రమంలో క్యాన్సిల్ అయిన విమానాలకు టికెట్ బుక్ చేసుకున్న పాసింజర్స్ అందరికీ డబ్బు రీఫండ్ చేస్తున్నట్లు బడ్జెట్ విమానాయాన సంస్థ ఇండిగో అనౌన్స్ చేసింది. వారందరికీ 2021 జనవరి 31లోపు డబ్బు రీఫండ్ చేస్తామని తెలిపింది.
అందుకోసం ఇప్పటికే రూ.1,000 కోట్లను ప్రాసెస్ చేసినట్లు ఇండిగో వెల్లడించింది. ఈ మొత్తం తమ ప్రయాణికులకు చెల్లించాల్సిన రీఫండ్‌లో 90 శాతానికి సమానమని వివరించింది. కోవిడ్ వ్యాప్తి కారణంగా ఒక్కసారిగా లాక్‌డౌన్ విధించడం వల్ల ఆదాయం పడిపోయిందని ఇండిగో పేర్కొంది. అందువల్లనే వెంటనే రీఫండ్ చేయలేకపోయామని తెలిపింది. దేశీయంగా విమాన ప్రయాణాలు కొనసాగుతున్న కారణంగా ఇప్పుడిప్పుడే ఆదాయం పెరుగుతోందని వివరించింది.
Also Read : అయ్యప్ప స్వామి దర్శనం కావాలంటే కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ ఉండాల్సిందే, ఒకవేళ లేకపోతే