లాభాలతో మొదలై.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

| Edited By:

Apr 03, 2019 | 7:31 PM

ముంబయి : నాలుగు రోజుల నుంచి దూసుకెళ్తున్న బుల్‌జోరుకు బుధవారం బ్రేకులు పడ్డాయి. బుధవారం ఉదయం లాభాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్లు ట్రేడింగ్‌ ముగిసే సమయానికి నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 179 పాయింట్లు నష్టపోయి 38,877 వద్ద, నిఫ్టీ 75 పాయింట్లు నష్టపోయి 11,638 వద్దకు చేరాయి. చరిత్రలోనే తొలిసారి సెన్సెక్స్ 39వేల మార్కును అధిగమించిన మరుసటి రోజే మార్కెట్లు నష్టపోయాయి. రియల్‌ ఎస్టేట్‌ షేర్లు రెండో రోజు కూడా లాభాల్లో కొనసాగాయి. […]

లాభాలతో మొదలై.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
Follow us on

ముంబయి : నాలుగు రోజుల నుంచి దూసుకెళ్తున్న బుల్‌జోరుకు బుధవారం బ్రేకులు పడ్డాయి. బుధవారం ఉదయం లాభాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్లు ట్రేడింగ్‌ ముగిసే సమయానికి నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 179 పాయింట్లు నష్టపోయి 38,877 వద్ద, నిఫ్టీ 75 పాయింట్లు నష్టపోయి 11,638 వద్దకు చేరాయి. చరిత్రలోనే తొలిసారి సెన్సెక్స్ 39వేల మార్కును అధిగమించిన మరుసటి రోజే మార్కెట్లు నష్టపోయాయి. రియల్‌ ఎస్టేట్‌ షేర్లు రెండో రోజు కూడా లాభాల్లో కొనసాగాయి. గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ జీవిత కాల గరిష్ఠాన్ని తాకింది. డీఎల్‌ఎఫ్‌ కూడా 52 వారాల గరిష్ఠ స్థాయిని చేరింది. ఇండియా బుల్స్, మారుతీ సుజుకీ, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్‌ లాభపడగా.. బీపీసీఎల్‌, జీఎంటర్‌టైన్‌మెంట్‌, ఐవోసీ, గెయిల్‌, ఎస్‌బీఐలు నష్టపోయాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి సుజుకీ (2.78%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.48%), హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (1.02%), టాటా స్టీల్ (0.81%), హీరో మోటో కార్ప్ (0.50%).

టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.40%), యస్ బ్యాంక్ (-2.37%), భారతి ఎయిర్ టెల్ (-2.11%), ఎల్ అండ్ టీ (-2.11%), సన్ ఫార్మా (-1.48%).