దేశంలో రికార్డుస్థాయిలో కరోనా.. లక్షకు చేరువగా కొత్త కేసులు..

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం కొనసాగుతూనే ఉంది. రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజుకు దాదాపు లక్ష కేసులకు చేరుకుంటుంది.

దేశంలో రికార్డుస్థాయిలో కరోనా.. లక్షకు చేరువగా కొత్త కేసులు..
Follow us

|

Updated on: Sep 13, 2020 | 9:59 AM

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం కొనసాగుతూనే ఉంది. రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజుకు దాదాపు లక్ష కేసులకు చేరుకుంటుంది. అటు మరణాల సంఖ్య కూడా పెరగుతుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కరోనాను జయంచలేక 1,114 మంది మృత్యువాతపడ్డారు. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 78,586కి చేరింది. అయితే, రోగుల రికవరీ రేటు పెరుగుతున్నప్పటికీ కేసుల నమోదు కూడా అదే స్థాయిలో రికార్డు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో అత్యధికంగా 97,570 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 46,59,984 కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇక, దేశంలో కరోనా బారినపడ్డవారిలో ఇప్పటివరకు 36 లక్షల మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారినట్లు తెలిపారు. ప్రతిరోజూ 70 వేలకు పైగా కోవిడ్‌ బాధితులు కోలుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య కంటే రికవరీ కేసుల సంఖ్య 3.8 రెట్లు అధికంగా ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగా శనివారం ఒక్కరోజే 10,71,702 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 5,62,60,928 మందికి కరోనా పరీక్షలు చేశామని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) తెలిపింది.