clone trains from September 21: రైల్వే ప్రయాణీకులకు ఇండియన్ రైల్వేస్ మరో గుడ్ న్యూస్ అందించింది. సెప్టెంబర్ 21 నుంచి దేశవ్యాప్తంగా 40 క్లోన్ రైళ్లను నడపాలని నిర్ణయించింది. ప్రయాణీకుల రద్దీ, అధిక వెయిటింగ్ లిస్టులు ఉన్న రూట్లలో ఈ క్లోన్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ క్లోన్ ట్రైన్స్‌కు 10 రోజులకు ముందే అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకునే వీలుండగా… అడ్వాన్స్ టికెటింగ్ బుకింగ్ సెప్టెంబర్ 19న మొదలు కానుంది.
సాధారణ రైళ్ల కంటే ముందుగా ఇవి బయల్దేరతాయని.. వీటికి హల్టింగులు కూడా తక్కువగా ఉంటాయని రైల్వే బోర్డ్ చైర్మన్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఇక ఈ క్లోన్ ట్రైన్లలో అధిక ఛార్జీలు వసూలు చేయనున్నారని తెలుస్తోంది. అంతేకాదు.. 40 రైళ్లలో 32 బీహార్ ప్రయాణీకులకే అందుబాటులో ఉండనున్నాయి. తెలంగాణకు రెండు రైళ్లను కేటాయించగా.. ఏపీకి ఒక్కటి కూడా దక్కలేదు. సికింద్రాబాద్ నుంచి ధానాపూర్ క్లోన్(02787/88) ట్రైన్స్ ను తెలంగాణకు కేటాయించగా.. సికింద్రాబాద్ తప్పితే ఈ రైలుకు రాష్ట్రంలో మరెక్కడా హల్టింగ్ లేదు.
Also Read:
ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!
అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!
బిగ్ బాస్ 4: ఈ సీజన్‌లో ఆమెదే భారీ రెమ్యునరేషన్
కేంద్రం మరో సంచలనం.. త్వరలోనే హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.!