రైల్వే ప్రయాణీకులూ బీ అలెర్ట్.. డెడ్ లైన్ వచ్చేసింది!

|

Aug 26, 2019 | 11:36 AM

రైల్వే ప్రయాణీకులూ బీ అలెర్ట్. అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేదించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇప్పటికే అన్ని జోన్ల అధికారులకు ఆదేశాలు జారీ చేయగా.. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న అమలు చేయాలని తేల్చారు. పర్యావరణంపై ప్లాస్టిక్ తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుండటంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను బ్యాన్ చేయాలని నిర్ణయించారు. తొలి దశగా రైల్‌లో పడి ఉన్న వాటర్ బాటిళ్లను సేకరించి వాటిని డిస్పోజల్ చేయడానికి ఐ‌ఆర్‌సీటిసీ.. 360 ప్రధాన […]

రైల్వే ప్రయాణీకులూ బీ అలెర్ట్.. డెడ్ లైన్ వచ్చేసింది!
Follow us on

రైల్వే ప్రయాణీకులూ బీ అలెర్ట్. అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేదించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇప్పటికే అన్ని జోన్ల అధికారులకు ఆదేశాలు జారీ చేయగా.. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న అమలు చేయాలని తేల్చారు. పర్యావరణంపై ప్లాస్టిక్ తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుండటంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను బ్యాన్ చేయాలని నిర్ణయించారు.

తొలి దశగా రైల్‌లో పడి ఉన్న వాటర్ బాటిళ్లను సేకరించి వాటిని డిస్పోజల్ చేయడానికి ఐ‌ఆర్‌సీటిసీ.. 360 ప్రధాన రైల్వే స్టేషన్లలో 1,853 ప్లాస్టిక్ వాటర్ బాటిల్ డిస్పోజల్ యంత్రాలను ఏర్పాటు చేయాలని రైల్వే బోర్డు అధికారులకు సూచించింది. అంతేకాకుండా వెండర్స్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వాడకుండా ఉండేలా ప్రోత్సహించాలని జోనల్ రైల్వేస్ జనరల్ మేనేజర్లకు లేఖలు రాసింది. అటు రైల్వే ఉద్యోగులకు కూడా ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని సూచనలు చేశారు.